‘కల్కి 2898 ఏడీ‘, ‘భారతీయుడు 2‘ తర్వాత టాలీవుడ్లో చిన్న సినిమాల హవా మళ్లీ మెుదలైంది. గత వారం లాగే ఆగస్టు సెకండ్ వీక్‌లోనూ చిన్న హీరోల సినిమాలే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
కమిటీ కుర్రోళ్ళు
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించనున్నారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
సింబా
జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకృతిని నాశనం చేస్తే, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో ఆగస్టు 9న థియేటర్లలో చూడబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
తుఫాన్
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘తుఫాన్’ (Toofan Movie 2024). విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఆగస్టు 2న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో వాయిదా పడి ఈ వీక్ థియేటర్లలోకి రాబోతోంది.
భవనమ్
సప్తగిరి (Sapthagiri), ధనరాజ్ (Dhanraj), షకలక శంకర్ (Shakalaka Shankar), అజయ్ (Ajay), మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ‘భవనమ్’ (Bhavanam) చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానుంది. సూపర్ గుడ్ ఫిలింస్ సమర్పణలో ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలకు, వినోదాన్ని జోడించి ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
భారతీయుడు 2
కమల్ హాసన్ (Kamal Hassan), శంకర్ (Director Shankar) కాంబోలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. తమిళం, తెలుగు, మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. జులై 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు విమర్శలను సైతం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులను ‘భారతీయుడు 2’ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Kingsman Golden Circle | Movie | English | Netflix | August 9 |
The Umbrella Academy | Series | English | Netflix | August 8 |
Bharateeyudu 2 | Movie | Telugu | Netflix | August 9 |
Phir Aaye Haseena Dilruba | Movie | Hindi | Netflix | August 9 |
Romance In the Hice | Movie | Korean/English | Netflix | August 10 |
Turbo | Movie | Telugu/Malayalam | SonyLIV | August 9 |
Bheema : Andhkaar se Adhikaar Tak | Movie | Hindi | Zee 5 | August 5 |
Amar Sanghi | Movie | Bengali | Zee 5 | August 5 |
Gaharah Gaharah | Movie | Hindi | Zee 5 | August 9 |
Manorathangal | Series | Telugu Dub | Zee 5 | August 15 |
The Zone : Survival Mission | Movie | Korean/English | Hotstar | August 7 |
AAA | Movie | Hindi | Hotstar | August 8 |
Are You Sure | Movie | Korean/English | Hotstar | August 8 |
Life Hill Gayee | Movie | Hindi | Hotstar | August 9 |
Darling | Movie | Telugu | Hotstar | August 13 |
Veeranjaneyulu Vihara Yatra | Movie | Telugu | ETV Win | August 14 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్