ఆగస్టులో వరుసగా చిత్రాలు రిలీజై సినీ ప్రియులను ఎంటర్‌టైన్ చేశాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ అదే జోష్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల ఫస్ట్ వీక్‌లో ఓ పాన్ ఇండియా చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest of All Time). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రానుంది. ఈ సాంకేతికతతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్’కు వర్క్ చేయడం విశేషం. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
35 చిన్న కథ కాదు
నివేదా థామస్ (Nivetha Thomas), విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ నటి నివేదా ఇందులో తొలిసారి తల్లి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
జనక అయితే గనక
యంగ్ హీరో సుహాస్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంగా అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ మూవీలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఉరుకు పటేలా
తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఉరుకు పటేలా’ (Uruku Patela). వివేక్ రెడ్డి దర్శకుడు. ఖుష్బూ చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు రిసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
Title | Category | Language | Platform | Release Date |
The Perfect Couple | Series | English | Netflix | Sep 05 |
Apollo 13: Survical | Documentary | English | Netflix | Sep 05 |
Bad Boys: Ride or Die | Movie | English | Netflix | Sep 06 |
Adios Amigo | Movie | Malayalam | Netflix | Sep 06 |
Sector 36 | Movie | Hindi | Netflix | Sep 13 |
Tanav Season 2 | Series | Hindi | SonyLIV | Sep 06 |
Thalaivan | Movie | Malayalam | SonyLIV | Sep 10 |
English Teacher | Movie | English | Hotstar | Sep 03 |
Kill | Movie | Hindi | Hotstar | Sep 06 |
Brick Toons | Movie | English | Hotstar | Sep 04 |
The Fall Guy | Movie | English | Jio Cinema | Sep 03 |
Fight Night: The Million Dollar Heist | Series | English | Jio Cinema | Sep 06 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్