అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే తొలిపాటను విడుదల చేయగా అది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ రెండో సాంగ్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
సోషల్ మీడియా షేక్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప 2 ‘నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను మేకర్స్ బుధవారం (మే 29) రిలీజ్ చేశారు. ఫోక్ స్టైల్‌లో మాస్ ట్యూన్స్‌తో సాగిన ఈ పాట రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్‌కు స్టెప్పులు సమకూర్చారు. ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
సాంగ్‌లో ఏముందంటే?
‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటలో పుష్పరాజ్ (బన్నీ), శ్రీవల్లి (రష్మిక) కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌లో ఐకానిక్ డ్యాన్స్ స్టెప్పులతో అల్లు అర్జున్, రష్మిక మందన్న అదరగొట్టారు. గణేష్ ఆచార్య అందించిన స్టెప్పులు చాలా క్యాచీగా ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్స్ మెస్మరైజ్‌చేస్తోంది. డైరెక్టర్ సుకుమార్ కూడా సాంగ్ చివర్లో స్టెపులు వేసి అలరించారు. తెలుగు, మలయాళం, కన్నడం, తమిళంతో పాటు మొత్తం ఆరు భాషల్లో సూసేకీ పాటను రిలీజ్ చేశారు. ఆరు భాషల్లోనూ శ్రేయా ఘోషల్ ఈ పాటను పాడటం విశేషం.

రారా నా సామి పాటను మరిపించిందా?
పుష్ప సినిమా నుంచి వచ్చిన ‘రారా నా సామి’ మెలోడి సాంగ్ దేశ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మాస్, క్లాస్ ఇలా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సాంగ్ మెస్మరైజ్ చేసింది. అయితే పుష్ప 2 నుంచి మెలోడి సాంగ్ అనగానే ఫ్యాన్స్ ‘రారా నా సామి’ రేంజ్‌లోనే ఊహించుకున్నారు. అయితే చాలా మందికి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట నచ్చినప్పటికీ.. ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసిన కొద్ది మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. తమకు సీక్వెల్‌లో సాంగ్ కంటే ‘రారా నా సామి’ పాటే బాగుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్‌కు ఈ మెలోడి అంతగా రుచించకవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

రికార్డుల మోత
పుష్ప 2 సినిమా నుంచి మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను, మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటకు 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అంతేకాదు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. రీసెంట్ టైమ్‌లో తెలుగులో అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న సాంగ్‌గా పుష్ప ఫస్ట్ సింగిల్ నిలిచింది.

క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్
ప్రస్తుతం ‘పుష్ప 2’ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పుష్ప 3కి సంబంధించిన సమాచారం క్లైమాక్స్‌లో ఇవ్వనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్‌లో ఆడిపాడనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సుకుమార్ ఈ పాటను కూడా షూట్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్