టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ (Ram Charan) ఒకరు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే నటుడిగా రామ్ చరణ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన చిత్రం మాత్రం ‘రంగస్థలం’ (Rangasthalam). డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్ నట విశ్వరూపం చూపించాడు. ఈ మెగా వారసుడి నటనకు ఇండస్ట్రీ మెుత్తం ఫిదా అయ్యింది. చరణ్‌లోని అసలైన నటుడ్ని సుకుమార్ బయటకు తీసుకొచ్చారని సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అటువంటి చరణ్-సుక్కు కాంబోలో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘RC 17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి చాలా రోజుల తర్వాత క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
పాన్ వరల్డ్ స్థాయిలో..
రామ్ చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడు మెుదలవుతుందా? అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రాన్ని మించి ‘RC 17’ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో చరణ్-సుక్కు మూవీ రూపుదిద్దుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ‘RC 17’ గ్లోబల్ స్థాయిలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఓ సమస్యను కీ పాయింట్‌గా చేసుకొని సుక్కు ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మెుదలైనట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ టేకింగ్‌కు పాన్ వరల్డ్ స్థాయి మూవీ పడితే ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ‘RC 17’కు సంబంధించి త్వరలోనే కీలక అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.
ఆ మూవీ తర్వాతే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ప్రకటించిన విధంగానే ‘ఉప్పెన’ (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) డైరెక్షన్‌లో చరణ్ నటించనున్నారు. ‘RC 16’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుంది. బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్-సుకుమార్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సెట్స్‌పైకి ఎప్పుడంటే?
డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 6న సినిమా రిలీజ్ చేసేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే ‘RC 17’ ప్రాజెక్ట్‌పై సుకుమార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశముంది. అయితే ఇప్పటికే రామ్‌చరణ్ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను సుకుమార్ మెుదలుపెట్టినట్లు కూడా టాక్ ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్దం చేసి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సుకుమార్ భావిస్తున్నారు.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అతడి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందట. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్-సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు.