ఐపీఎల్ 2023లో స్లో ఓవర్ రేట్ అంశం చర్చనీయాంశమవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. వార్నర్‌కే కాదు.. అంతకముందు మ్యాచుల్లోనూ కోహ్లీ, డుప్లెసిస్, సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కూడా ఫైన్ కట్టాల్సి వచ్చింది. అసలు స్లో ఓవర్ రేట్ అంటే ఏంటి? నిబంధనలు ఏమున్నాయి? అనేవి తెలుసుకుందాం.
స్లో ఓవర్ రేట్ అంటే ఏంటి?
ప్రతి మ్యాచ్‌లో గంటకు ఇన్ని ఓవర్లు వేయాలి అనే నిబంధన ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం టెస్ట్‌లో గంటకు సుమారు 15 ఓవర్లు, వన్టేల్లో 14.28, టీ 20ల్లో 14.11 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. అంటే వన్టేల్లో 3.5 గంటల్లో 50 ఓవర్లు పూర్తి చేయాలి. T20ల్లో మాత్రం 1.25 గంటల్లో 20 ఓవర్లు వేయాలి. ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా వేయలేకపోతే స్లో ఓవరేట్‌ను ఎదుర్కొంటారు.
ఐపీఎల్లో ఇలా
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్లో ఓవరేట్లో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. రెండు స్ట్రాటెజిక్ టైమ్ అవుట్లు కలుపుకొని 1.30 గంటల్లో 20 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఐపీఎల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది.
నిబంధనలు
స్లో ఓవర్ రేట్‌ను తొలిసారి నమోదు చేస్తే జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా పడుతుంది. రెండోసారి కూడా ఇలాగే జరిగితే రూ. 24 లక్షల ఫైన్ వేస్తారు. జట్టులో ఉన్న మిగిలిన 10 మంది సభ్యులకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇందులో ఏది తక్కువైతే దాన్ని తీసుకుంటారు.
మూడోసారి స్లో ఓవర్ రేట్‌కు కారణమైతే కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. జట్టులో ఆడుతున్న సభ్యులకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. దీంతోపాటు నిర్ణీత సమయంలోగా ఆటను పూర్తి చేయలేకపోతే ఒక ప్లేయర్ 30 యార్డుల లోపలికి రావాల్సి ఉంటుంది. ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే అన్ని ఓవర్లు కేవలం 4 మాత్రమే 30 యార్డ్స్ బయట ఉండాలి.
ఇప్పటివరకు వీళ్లే
ఐపీఎల్ 2023 ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడిచాయి. ఇప్పటికే ఆసక్తికరమైన మ్యాచ్‌లు చాలా జరిగాయి. ఇందులో భాగంగా వివిధ ఫ్రాంఛైజీల కెప్టెన్లకు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు. గుజరాత్ కెప్టెన్ పాండ్యా, రాజస్థాన్ సంజూశాంసన్, ముంబై సూర్య కుమార్ యాదవ్, లక్నో సారథి కేఎల్ రాహుల్‌లకు మెుదటిసారి నమోదు చేయడంతో రూ. 12 లక్షల ఫైన్ పడింది. ఇంతకముందు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించగా.. తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతున్న కోహ్లీ కూడా రూ. 24 లక్షల ఫైన్‌కు గురయ్యాడు.
మ్యాచ్ నిషేధం
ఐపీఎల్లో ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. మరోసారి ఇలాగే జరిగితే కెప్టెన్లపై నిషేధం పడవచ్చు. కీలకమైన మ్యాచ్‌లకు వాళ్లు దూరమైతే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి.
ప్రేక్షకులకు పరీక్ష
స్లో ఓవర్ రేట్ ప్రేక్షకులకు కూడా పరీక్ష పెడుతుంది.టైమ్ ఔట్‌కు ఇది కూడా తోడవటంతో మ్యాచ్‌లు మరింత ఆలస్యం అవుతున్నాయి. ఒక్కోసారి రాత్రి 11.30 గంటలు దాటుతుండటం.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఇప్పటికైనా త్వరగా మ్యాచ్‌లు పూర్తయ్యేలా చూస్తే మరికొంతమంది వీక్షించే అవకాశం ఉంటుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!