• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాబర్‌ను కెప్టెన్‌గా తీసేయండి: మాజీలు

  అఫ్గాన్‌ చేతిలో ఓటమితో పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌పై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ పేసర్ అకీబ్ జావెద్ మాట్లాడుతూ ‘వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి. అతడి స్థానంలో వైట్‌బాల్‌ క్రికెట్‌కు షహీన్ అఫ్రిదిని కెప్టెన్‌గా చేస్తే బాగుంటుంది’ అని అన్నాడు. మరోవైపు ‘బాబర్‌ అజామ్ కెప్టెన్సీ దారుణంగా ఉంది. బౌలర్లను వినియోగించుకున్న తీరు సరికాదు. పవర్‌ ప్లే ఓవర్లలో హారిస్‌ రవూఫ్‌ను తీసుకురావడం శుద్ధ దండగ. ఫీల్డింగ్‌ సెటప్‌ కూడా దారుణంగా ఉంది’ అని … Read more

  అందుకే ఓడిపోయాం: బాబర్ అజామ్

  అఫ్గానిస్థాన్‌పై ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ స్పందించాడు. ‘ఈ ఓటమి మమ్మల్ని మరింత బాధపెట్టింది. మంచి టార్గెట్ అఫ్గాన్ ముందు ఉంచినా కాపాడుకోలేకపోయాం. స్పిన్నర్లు అనుకున్నంత రాణించలేకపోయారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాం. అఫ్గాన్ ప్లేయర్లు బాగా ఆడారు. నాణ్యమైన ఆటతీరు కనబరిచారు. అందుకే వారు గెలిచారు. ఈ మ్యాచ్ నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. తర్వాతి మ్యాచ్‌ల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని చెప్పాడు.

  హైదరాబాద్‌కు చేరుకున్న పాక్ క్రికెట్ టీం

  వరల్డ్‌ కప్ మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ టీం హైదరాబాద్ చేరుకుంది. పాక్ క్రికెటర్లకు భారత అభిమానులు ఘన స్వాగతం పలికారు. దాదాపు ఏడేళ్ల తర్వాత దాయాది జట్టు ఇండియాలో అడుగు పెట్టింది. పాక్ క్రికెటర్లకు కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు అందించారు. పార్క్‌ హయాత్ హోటల్‌లో వారికి బస ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే వామప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుంది. https://x.com/TheRealPCB/status/1707128719079580104?s=20

  ఏడ్చేసిన బాబర్ అజామ్

  మ్యాచ్ చివరి వరకూ పోరాడినా ఓటమి పాలవ్వడంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏడ్చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ చివరి బంతికి ఓడిపోవడం బాబర్ జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకూ పోరాడినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి రావడంతో రెండు రన్స్ కొట్టి ఫైనల్‌కు చేరింది. https://x.com/shubham84777556/status/1702498485457522932?s=20

  హార్దిక్ దెబ్బకు బాబర్ షాక్.. ఇదెక్కడి స్వింగ్‌రా మామ!

  ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో.. పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను బోల్తా కొట్టించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హార్దిక్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని బాబర్ ఢిపెన్స్‌ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఒక్కసారిగా బాబర్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://x.com/UllahIkhtasham/status/1701244803743162855?s=20

  కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా: బాబర్‌

  గతంలో విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ అజామ్‌ తాజాగా స్పందించాడు. ఆ వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఎవరి దగ్గరి నుంచైనా పాజిటివ్‌ కామెంట్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటివి లభిస్తే మాత్రం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్‌లో అవి చాలా ఉపయోగపడ్డాయి. 2019లో కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు అతడి మాటతీరు ఆకట్టుకుంది’ అని బాబర్‌ … Read more

  కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్

  పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో వేగంగా 9000 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. బాబర్ కేవలం 245 మ్యాచ్‌లలోనే 9 వేల పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 249 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు. కోహ్లీ 271 మ్యాచ్‌లు తీసుకున్నాడు. అలాగే వార్నర్ 273, ఫించ్ 281, ఏబీ డివిలియర్స్ 304, శిఖర్ ధవన్ 308, మార్టిన్ గప్టిల్ 313 … Read more

  బాబర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆఫ్రిది

  [VIDEO:](url) కెప్టెన్ వికెట్ తీస్తే ఆ ఆనందమే వేరు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ అజామ్‌ని షాహిన్ షా ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య మ్యాచ్‌లో కళ్లు చెదిరే బంతితో బాబర్‌ని ఆఫ్రిది పెవిలియన్ పంపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లాహోర్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 241 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన బాబర్ అజామ్, మహ్మద్ హారిస్‌లను ఆఫ్రిది క్లీన్ … Read more

  కోహ్లీ కంటే బాబర్ బెటర్; మిల్లర్

  [వీడియో; ](url)టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కంటే పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ బెటర్ అని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కంటే బాబర్ కవర్ డ్రైవే చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. తాను బాబర్ కవర్ డ్రైవ్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. కాగా మిల్లర్‌పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్నంత మాత్రానా బాబర్‌కు మద్ధతు పలుకుతావా అంటూ ఫైర్ అవుతున్నారు. Kohli vs Babar and Bumrah vs Shaheen David Miller is made … Read more

  అసహనానికి గురైన బాబర్ ఆజాం

  [VIDEO:](url) పాకిస్థాన్ ప్రీమియర్‌ లీగ్‌లో సరదా సన్నివేశం జరిగింది. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజాం… ప్రత్యర్థి ఆటగాడు హసన్‌ అలీని బ్యాట్‌తో కొట్టడానికి ప్రయత్నించాడు. హసన్‌ వేసిన బాల్‌కు బాబర్ సింగిల్ తీయటానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడు అడ్డుగా నిల్చొవచటంతో.. బాబర్ బ్యాట్‌ను పైకెత్తాడు. దీంతో హసన్‌ పక్కకి పారిపోయాడు. మరోవైపు ఇన్నింగ్స్‌ చివరి బంతికి కేవలం సింగిల్‌ రావటంతో అసహనానికి గురయ్యాడు బాబర్. బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. HASAN and babar??? pic.twitter.com/hzve62ME4o — … Read more