• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌కు అధికారం తలకెక్కింది: కిషన్ రెడ్డి

    సీఎం కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘ప్రధాని తెలంగాణకు వస్తే.. ఆయనను టూరిస్ట్‌ అనడమేంటి? కేంద్రం తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి పనులను స్వాగతించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబానికి అధికారం తలకెక్కింది. కేటీఆర్‌ అభద్రతాభావంతో ఉన్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్‌లో కల్వకుంట్ల కుటుంబం ఇంకా 2 నెలలు మాత్రమే ఉంటుందిట’ అని చెప్పుకొచ్చారు.

    ‘కేసీఆర్ కనిపించడం లేదు.. అతనిపైనే అనుమానం’

    బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనిపించడం లేదు.. మాకు కేటీఆర్ పైనే అనుమానం ఉంద్నారు. కేసీఆర్ 15 రోజులుగా కనిపించడంలేదని.. తమకు ఏదో అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేసిండా? ఏమైనా ఇబ్బంది పెడుతుండా? ఎందుకంటే ఆయన కేసీఆర్ మా సీఎం. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కేసీఆర్ గారితో ప్రెస్‌ మీట్ పెట్టించండి. అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని మేం నమ్ముతాం’ అంటూ వ్యాఖ్యానించారు.

    మేనిఫెస్టోపై కేసీఆర్ దృష్టి

    సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టిసారించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు మేనిఫెస్టోను రెడీ చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్‌లకు ధీటుగా.. మహిళలు, రైతులే ప్రధానంగా హామీలు రూపొందిస్తున్నారు. రైతులకు ఉచిత ఎరువులు, మహిళలకు జీరో వడ్డీ రుణాలు వంటి స్కీమ్స్‌ తీసుకొచ్చేందుకు అధికారులు, పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.

    కేసీఆర్ ఎన్డీయేలో చేరుతామన్నారు: మోదీ

    నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ ఎన్టీయేలో చేరుతామని తనను ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు. అయితే తాము బీఆర్‌ఎస్‌తో పొత్తును తిరస్కరించామని చెప్పారు. GHMC ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాష్ట్ర సంపదను ఓ కుటుంబం దోచుకుంటుందని మోదీ విమర్శించారు.

    అంగన్‌వాడి టీచర్లపై వరాల జల్లు

    అంగన్‌వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్‌వాడీలను చేర్చాలని నిర్ణయించింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించనుంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను కేసీఆర్ సర్కారు విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా జీతాలు పెంచాలని అంగన్‌వాడి టీచర్లు ధర్నా చేస్తున్న సంగతి తెసిందే. గౌరవ వేతనం రూ.15 వేలను డబుల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా నిర్ణయంపై అంగన్‌వాడి టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభం

    తెలంగాణలో అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ?Watershed moment in the irrigation history of #Telangana! CM #KCR … Read more

    పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభం

    తెలంగాణలో అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ?Watershed moment in the irrigation history of #Telangana! CM #KCR … Read more

    కంటతడి పెట్టిన కేసీఆర్

    తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పించే క్రమంలో భావోద్వేగానికి లోనయ్యారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన సీఎం.. కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయిచంద్‌ భార్య, పిల్లలు కేసీఆర్‌ కాళ్లపై పడి రోదించారు. ఈ క్రమంలో వారిని ఓదార్చే క్రమంలో కేసీఆర్‌ కంటతడి పెట్టారు. అనంతరం సాయిచంద్‌ తండ్రి వెంకట్‌రాములును ఓదార్చారు. తానున్నాంటూ వారికి భరోసా ఇచ్చారు. హఠాన్మరణం చెందిన ఉద్యమ గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి … Read more

    Then-Now: తెలంగాణ రాకముందు అలా.. వచ్చాక ఇలా.. ఎంత మార్పో మీరే చూడండి..!

    ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. … Read more

    LIVE: సీఎం కేసీఆర్ ప్రసంగం

    తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నూతన సచివాలయ శుభారంభ శుభాకాంక్షలు తెలియజేశారు.