‘పెళ్లిచూపులు’ అంటూ పక్కింటి అబ్బాయిలా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. వెంటనే అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాడు. రౌడీబాయ్ యాటిట్యూడ్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటేనే విజయ్ స్టార్‌డమ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమాన గణాన్ని కాపాడుకుంటేనే పక్కాగా సినిమాలు చేస్తున్నాడు దేవరకొండ. లైగర్ బెడిసి కొట్టినా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరోది కీలక పాత్ర. ఫలానా వారినే పెట్టుకుందామని హీరోలు సిఫార్సు చేస్తే డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఒకే చెప్పేస్తారు. అయితే, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం ప్రత్యేక రూటు ఫాలో అవుతున్నాడు. తెలుగులో టాప్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే అప్ కమింగ్ సినిమాల్లో హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడీ హ్యాండ్‌సమ్ హీరో.
సమంత
మహానటి సినిమాలో పార్ట్ టైం హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్‌కి తోడుగా సమంత నటించింది. కానీ, ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్‌కు స్కోప్ లేకుండా పోయింది.
ఖుషీ సినిమాతో మరోసారి సామ్, విజయ్ ఒక్కటయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా డైరెక్టర్ శివ నిర్వాణ దీన్ని తీర్చిదిద్దాడు.
సినిమాలో నుంచి ‘నా రోజా నువ్వే’ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని రాబడుతోంది. మరి, ఇందులో సమంతతో విజయ్ ఏ మేరకు రొమాన్స్ చేశాడో వేచి చూడాలి.
శ్రీలీల
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా శ్రీలీల బిజీబిజీగా ఉంది. జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. ఈ ప్రాజెక్టు చిత్రీకరణ దశలో ఉంది.
ఇప్పటివరకు శ్రీలీల లిప్‌లాక్ సీన్లలో నటించలేదు. గౌతమ్ తిన్ననూరి తొలి సినిమాలో రొమాన్స్‌ని బాగా చూపించాడు. కథ వేరే అయినప్పటికీ ఈ సీన్స్ పెట్టి ఆడియెన్స్‌ని సాటిస్‌ఫై చేశాడు.
ముఖ్యంగా, విజయ్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ని చాలా మంది ఇష్టపడతారు. దీంతో ఈ సినిమాలోనూ శ్రీలీల, విజయ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్‌ని డైరెక్టర్ హను చాలా పద్ధతిగా చూపించాడు. కానీ, మృణాల్ ఠాకూర్ తరచూ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది.
బికినీలు ధరించి సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఏ మాత్రం సంకోచించకుండా అందాల నిధిని బయటకు తెరుస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో జతకట్టింది.
గీతగోవిందం సినిమా ఫేమ్ డైరెక్టర్ పరషురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతగోవిందం సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది. మరి, అటు రౌడీబాయ్, ఇటు గ్లామర్ బ్యూటీ ఏ మేరకు రెచ్చిపోతారో? అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.
వీరిద్దరి మధ్య రోమాన్స్ పండితే ఇక సినిమా బ్లాక్ బాస్టర్ అని కామెంట్ చేస్తున్నారు.
లవ్ స్టోరీగానే ఈ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రొమాంటిక్ సన్నివేశాలకు కొదవ ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలనాటి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!