విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ జట్టు స్టాండర్డ్స్‌ను Next Level కి తీసుకెళ్లిన వ్యక్తి. కానీ ఏం జరిగిందో ఏమో సడెన్‌గా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. BCCI నిర్ణయంతో క్రీడాలోకం, కోహ్లీ అభిమానులు నివ్వెరపోయారు.
BCCI నన్ను సంప్రదించలేదన్న విరాట్…
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎంత మంది ఉన్నా కానీ ఇండియన్ టీం ఫిట్‌నెస్ లెవల్స్ పెంచిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి దించేయడం కోహ్లీ అభిమానులకనే కాదు క్రికెట్ అభిమానులకు కూడా రుచించలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ బీసీసీఐ నిర్ణయం షాక్ కు గురి చేసింది.
కోహ్లీ VS రోహిత్…
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోందని చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి మీడియా కోడై కూసింది. అయినా కానీ బీసీసీఐ పెద్దలు గానీ.. మాజీలు గానీ ఎవరూ కూడా ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయాన్ని అలాగే వదిలేశారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ పోయేందుకు ఇది కూడా కారణమా? అని అందరూ అనుమానపడుతున్నారు.
ఎట్టకేలకు మీడియా ముందుకు కోహ్లీ…
తనను వన్డే కెప్టెన్‌గా తొలగించిన తర్వాత విరాట్ కోహ్లీ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కోహ్లీ అసలు బీసీసీఐ నన్ను సంప్రదించలేదని చెప్పి బాంబు పేల్చాడు. కెప్టెన్సీ తీసేస్తున్నట్లు మీటింగ్‌కు గంట ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని అన్నాడు. కానీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం విరాట్‌ను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం గమనార్హం.
టీ20 కెప్టెన్సీ విషయంలో…
టీ20 కెప్టెన్సీ వదులుకున్న సమయంలో కూడా గంగూలీ తనతో మాట్లాడలేదని విరాట్ తెలిపాడు. అన్ని పనులు చకచకా జరిగిపోయాయని పేర్కొన్నాడు. అయినా వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో తనకు ఏ మాత్రం బాధ లేదని.. తనపై ఉన్న ఒత్తిడి మరింత తగ్గుతుందని ఆయన పేర్కొన్నాడు.
గంగూలీ ఏం చెప్పాడంటే…
కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… వైట్ బాల్ కోసం ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని అందుకోసమే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీ కెప్టెన్సీని తొలగించి రోహిత్ శర్మకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. టీ20 కెప్టెన్సీ వదిలేస్తున్న సమయంలో కూడా వదులుకోవద్దని విరాట్‌కు చెప్పామని.. కానీ విరాట్ తమ మాట వినలేదని తెలిపాడు. కానీ ఈ రోజు మీడియాతో మాట్లాడిన విరాట్ అసలు తనను ఎవరు కూడా వద్దని చెప్పలేదని చెప్పాడు. మరి ఎవరి మాటల్లో నిజం ఉందో వారికే తెలియాలి.
విరాట్ అప్పటిదాకా ఆడడా?
కెప్టెన్సీ మార్పుకు ప్రధాన కారణం 2023 వరల్డ్‌కప్. స్వదేశంలో జరగబోయే ఈ వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకునే విరాట్ ను తొలగించి రోహిత్ కు వన్డే పగ్గాలు అప్పగించారని టాక్ నడుస్తోంది. అంటే విరాట్ కోహ్లీ 2023 వరల్డ్‌కప్ ఆడడా? అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
‘బీసీసీఐ చెప్పుడు మాటలు పట్టుకుంది’
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని, కార్యదర్శి జైషాను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసలు అన్ని మేజర్ ఈవెంట్లలో రోహిత్ కన్నా.. కోహ్లీనే ఎక్కువ పరుగులు చేశాడని ఆధారాలతో సహా బయటపెట్టాడు.
హోరెత్తిపోతున్న సోషల్ మీడియా…
విరాట్ కోహ్లీ తొలగింపుపై సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. క్రికెట్‌లో పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. క్రికెట్‌లో ఇలాంటివి జరగడం సరికాదని అంటున్నారు.
BCCI అర్థం ఇదేనట…
BCCI (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) అని చాలా మంది అనుకుంటారని కానీ BCCI అంటే Board Of Cricket Clownery In Indiaలా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.
ఎవరు నిజం చెప్పారు?
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక విధంగా మాట్లాడగా… విరాట్ కోహ్లీ మరోలా మాట్లాడాడు. విరాట్ టీ20 కెప్టెన్సీ వదిలేసుకున్న సమయంలోనే తాను నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసినట్లు గంగూలీ తెలిపాడు. కానీ తనను ఎవరూ సంప్రదించలేదని ఈ రోజు విరాట్ తెలిపాడు. దీంతో ఎవరు చెప్పిందో నమ్మాలో తెలియక ఫ్యాన్స్ తికమకపడుతున్నారు.
‘BCCI రియల్ కట్టప్ప’
కొత్త కోచ్ పాత్ర ఉందా?
కోహ్లీ కెప్టెన్సీ మార్పు విషయంలో టీమిండియా నూతన కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఉందని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. గంగూలీ, ద్రవిడ్, జైషాలు కలిసే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారని ఆరోపణలు చేస్తున్నారు.
పెద్ద బాంబే పేల్చిన విరాట్
డిసెంబర్ 8న కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగిస్తూ రోహిత్ ను కొత్త కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. మొదట్లో కోహ్లీ అభిమానులు బీసీసీఐ మీద దుమ్మెత్తిపోసినా.. కోహ్లీని అడిగే ఇలా చేశామని గంగూలీ వివరణ ఇవ్వడంతో కాస్త శాంతించారు. కానీ ప్రస్తుతం కోహ్లీ తననెవరూ సంప్రదించలేదని మీడియా సమావేశంలో తెలపడంతో మరో మారు కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర కోపంలో ఉన్నారు. బీసీసీఐ అధికారులను, పెద్దలను ఉద్దేశిస్తూ పలు ట్వీట్లు చేస్తున్నారు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?