• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara 10 Days Collections: పది రోజులైనా తగ్గని దేవరోడి ఊచకోత.. రూ.500 కోట్లకు చేరువలో కలెక్షన్స్‌?

    జూ. ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్‌ చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది. తొలుత మిక్స్‌డ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు ప్రదర్శించింది. తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తయ్యాయి. దేవర 10 డేస్‌ కలెక్షన్స్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించగా ఆ ఫిగర్స్‌ చూసి అందరూ షాకవుతున్నారు. దేవరోడి ఊచకోత ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. 

    రూ.500 కోట్లకు చేరువలో..

    దేవరలో తారక్‌ జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించాడు. ఇక దేవర కలెక్షన్స్‌ విషయానికి వస్తే ఈ సినిమాా 10 రోజుల్లో రూ.466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని వరల్డ్‌ వైడ్‌గా తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. బ్లాక్‌ బాస్టర్‌ కలెక్షన్స్‌తో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోందని పేర్కొన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.193.55 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కర్ణాటకలో రూ.16.40 కోట్లు, తమిళనాడులో రూ.4 కోట్లు, కేరళలో రూ.92 లక్షలు, హిందీతో పాటు రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో రూ.29.80 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఇదే ఊపు కొనసాగితే ఈ వీకెండ్‌లోనే రూ.500 కోట్ల మార్క్‌ను దేవర అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    ఫస్ట్‌డే, వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే?

    ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌ జంటగా నటించిన దేవర చిత్రం తొలి రోజు ఏకంగా రూ.రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.రూ.83.71 కోట్లు రాబట్టి ‘RRR’ తర్వాత ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇక తొలి వీకెండ్‌ పూర్తయ్యే సరికి దేవరోడు కలెక్షన్ల మార్క్‌ రూ.300 కోట్లు అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.రూ.304 కోట్లు (GROSS) వసూళ్లు సాధించి సత్తా చాటింది. అయితే ఆ తర్వాత నుంచి వసూళ్లు క్రమేణా తగ్గుతూ వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లను మాత్రం లాభాల్లోకి తీసుకొచ్చింది. గత వారం పెద్ద చిత్రాలు రిలీజ్ కాకపోవడంతో ‘దేవర’కు ఈ వీకెండ్‌ వరకూ వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. తేలికగానే రూ.500 కోట్ల మార్క్‌ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    ఆదివారం నుంచి లాభాల్లోకి..

    తెలుగు రాష్ట్రాల్లో దేవర శనివారం (సెప్టెంబర్‌ 5) సెకండ్ షోస్ ముగిసే నాటికి దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఆదివారం నుంచి వస్తున్న కలెక్షన్స్‌ అన్నీ లాభాలే. దసరా సెలవులు కూడా కలిసి రావడం మరే పెద్ద సినిమాలు లేకపోవడం దేవరకు బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అటు ఓవర్సీస్‌లోనూ దేవర కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. తెలుగుతో పాటు కేరళ, కర్ణాటక, హిందీ, రెస్ట్ ఆఫ్‌ ఇండియాలో చాలా చోట్ల దేవర లాభాల్లోకి వచ్చేసిందని ట్రెడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. దీంతో దేవర టీమ్‌తో పాటు తారక్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 

    రూ.500 కోట్లు క్రాస్‌ చేసిన తెలుగు చిత్రాలు

    అయితే టాలీవుడ్‌ నుంచి వచ్చిన పలు చిత్రాలు ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎన్ని రోజుల్లో రూ.500 కోట్లు సాధించాయి? ఓవరాల్‌ కలెక్షన్స్ ఎంత? ఆయా చిత్రాల డైరెక్టర్లు ఎవరు? ఏ స్టార్‌ హీరో అందులో నటించాడు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

    కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)

    ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. ఓవరాల్‌గా రూ.1200 కోట్లను తన ఖాతాలో వేసుకొని ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

    యానిమల్‌ (Animal)

    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఆరు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 917.82 కోట్లను కొల్లగొట్టి సత్తా చాటింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది. 

    సలార్‌ (Salaar)

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవరాల్‌గా రూ.700 కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ నటించారు. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది. 

    RRR

    రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR‘ పలు రికార్డులను కొల్లగొట్టింది. తొలి మూడు రోజుల్లోనే రూ.570 కోట్లను కొల్లగొట్టి ప్రశంసలు అందుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.

    బాహుబలి (Bahubali)

    ప్రభాస్‌ హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్‌ గతినే మార్చేసింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్‌ సత్తా ఏంటో తొలిసారి దేశానికి తెలిసింది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. మెుత్తంగా రూ.600-650 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. 

    బాహుబలి 2 (Bahubali 2)

    బాహుబలి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టి దేశంలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv