అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) శతజయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రామ్‌చరణ్ (Ramcharan), నాగచైతన్య (Naga Chaitanya) సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఏఎన్నార్ జాతీయ అవార్డ్’ను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. బిగ్‌బీ అమితాబ్ చేతుల మీదుగా చిరు ఈ పురస్కారాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడిన చిరు గతంలో వజ్రోత్సావల సందర్భంగా మోహన్‌బాబుతో జరిగిన గొడవను గుర్తుచేసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
2007లో తెలుగు సినీ పరిశ్రమ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు వజ్రోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేడుకలో మెగాస్టార్ చిరును లెజండరీ అవార్డ్‌తో సత్కారించాలని నిర్ణయించారు. దీనిపై మాట్లాడిన నటుడు మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను సన్మానిస్తున్నాం అంటూ కొందరు వచ్చారని అయితే లెజండ్‌గా కాదు, సెలబ్రిటీ హోదాలో అవార్డు ఇచ్చి గౌరవిస్తామని చెప్పారన్నారు. ‘ఈ సందర్భంగా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుంకుంటున్నా. లెజెండరీ అంటే ఏంటి? సెలబ్రిటీ అంటే ఏంటో ఓ పుస్తకం రాసి వాటికి అర్ధం వివరించి అవార్డు ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీలో బతికి ఉన్న నటుల్లో తొలిసారి రాజ్యసభకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిని. కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అది లెజెండరీ కాదా? కులమతాలకు అతీతంగా 25% పేదలకు ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాను అది లెజెండరీ కాదా? 500 సినిమాలకు పైగా నటించాను, 45 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను అది లెజెండరీ కాదా? అంటూ సినీ పెద్దలను ప్రశ్నించారు.
అప్పుడు చిరు ఏమన్నారంటే?
మోహన్ బాబు ప్రశ్నించడంపై చిరంజీవి సైతం ఘాటుగా స్పందించారు. ‘ఒక రామారావు, రాఘవేంద్రరావు, బాపు గారు, విశ్వనాథ్ గారు, దాసరి నారాయణ గారు ఉన్నారు. వారంతా లెజెండ్స్. వారికి అవార్డు ఇవ్వండి. నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా ఒకే ఏజ్ వాళ్లం. నాకు అవార్డు ఇచ్చి నన్ను వారి నుంచి దూరం చేయకండి. నన్ను పెద్దవాడిని చేయకండి అని ముందే చెప్పాను. నాకు లెజెండరీ అవార్డు వద్దు అన్నది సత్యం. అయితే నేను లెజెండరీ అవార్డు తీసుకొనేందుకు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను దానికి అర్హుడిని కాదని భావిస్తే ఆ అవార్డును తీసుకోను. దానిని ఓ బాక్స్‌లో పెట్టి సరెండర్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఆ అవార్డుకు అర్హుడినైతే దానిని అప్పుడే తీసుకొంటాను. 100 ఏళ్ల ఫంక్షన్ జరిగే సమయానికి నేను, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు అప్పటి వరకు పెద్దవాళ్లం అవుతాం. అప్పుడు నాకు అర్హత ఉంటే అవార్డు తీసుకొంటాను. అప్పటి వరకు ఆ అవార్డును సమాధి చేస్తాను’ అని వజ్రోత్సవం వేడుకలో చెప్పుకొచ్చారు.
ఏఎన్నార్ ఈవెంట్లో ఏం చెప్పారంటే?
ప్రతిష్టాత్మక స్వర్గీయ ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు వజ్రోత్సవం సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నా ఇల్లు అనుకుంటే ఇంట గెలిచే అవకాశం 2007లో వజ్రోత్సవం సందర్భంగా వచ్చిందని చిరు అన్నారు. అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డు ప్రధానం చేస్తామంటే చాలా సంతోషం వేసిందన్నారు. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంతమంది హర్షించని సమయంలో తనకు ఆ అవార్డు తీసుకోవాలని అనిపించలేదన్నారు. అందుకే తనకు వచ్చిన అవార్డును ఓ బాక్స్‌లో పెట్టి నాకు అర్హత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తీసుకొంటానని చెప్పానన్నారు. ‘ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నాఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు పుచ్చుకొన్న రోజున, అదీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా తీసుకొన్న రోజున, నా మిత్రుడు నాగార్జున మనస్పూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకు మీకే అర్హత ఉందని చెప్పినప్పుడు ఇప్పుడు ఇంట గెలిచాను. రచ్చ గెలిచాను అనే ఫీలింగ్ కలిగింది’ అని మెగాస్టార్ అన్నారు.
‘ఆ మాటలకు వణుకు వచ్చింది’
ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ మంచి జరిగినా, అవార్డు వచ్చినా తొలుత అమితాబ్ నుంచే శుభాకాంక్షలు వస్తాయని అన్నారు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని అమితాబ్ అన్నారని గుర్తుచేశారు. ఆ మాటలు విన్నాక చిన్న వణుకు వచ్చిందని పేర్కొన్నారు. అయితే తన మనసు అమితానందంతో నిండిపోయిందని చిరంజీవి తెలిపారు. అటు ‘సైరా’ సినిమాలో తన గురువు పాత్ర కోసం అమితాబ్‌ను సంప్రదించినప్పుడు వెంటనే ఓకే చెప్పారని చిరు తెలిపారు. ఫార్మాలిటీస్ (పారితోషికం) గురించి అడిగినప్పుడు ‘అలాంటిదేది అక్కర్లేదు.. నువ్వు నా స్నేహితుడివి’ అన్నారని గుర్తుచేసుకున్నారు.
Celebrities Featured Articles Movie News
Prabhas: ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!