ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ నటి
బాలీవుడ్ నటి, ‘చక్‌దే ఇండియా’ ఫేం తాన్యా అబ్రోల్ తన ప్రియుడు ఆశిష్ వర్మను పెళ్ళాడింది. వీరి వివాహం బంధుమిత్రుల మధ్య చంఢీగర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాన్యా, ఆశిష్‌లు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. తాజాగా వారిద్దరూ పెళ్లిపీటలెక్కారు. కాగా తాన్యా 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘చక్‌దే ఇండియా’ మూవీలో మెరిసింది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి సంచలన విజయం సాధించింది. Screengrab Instagram: tanyaabrol Screengrab Instagram: