• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    Tamannaah Bhatia: బిగుతైన జాకెట్‌తో రెచ్చగొట్టిన తమన్నా!
    See More

    ట్రెండింగ్‌లో ‘ధూం ధాం దోస్తాన్’

    నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ధూం ధాం దోస్తాన్’ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. 56లక్షలకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మాస్ కోణంలో సాగే ఈ పాట జనాలను ఉర్రూతలూగిస్తోంది. నాని గెటప్ ఆకట్టుకుంటోంది. ఇక కాసర్ల శ్యామ్ లిరిక్స్‌కి రాహుల్ సిప్లిగంజ్ మాస్ వాయిస్ తోడవడంతో ఓ ఊపు ఉపేస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. మీరూ ఓసారి ఈ పాట వినేయండి.

    చిరంజీవి పోతరాజు డ్యాన్స్ వీడియో వైరల్

    హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్‌’ కార్యక్రమంలో చిరు చేసిన పోతరాజు డ్యాన్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరు పోతరాజు కొరడా పట్టుకుని చిందులేశారు. విజయ దశమి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. మరోవైపు దసరాకు విడుదలైన చిరు సినిమా గాడ్‌ ఫాదర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. వీడియో కోసం ఇన్‌స్టాగ్రాంపై క్లిక్‌ చేయండి. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

    సల్మాన్‌కు చిరు ప్రత్యేక కృతజ్ణతలు

    ‘గాడ్‌ఫాదర్’ చిత్రం విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి ఖుషీఖుషీగా ఉన్నారు. ఈ సినిమాలో మసూమ్ భాయ్‌గా నటించిన సల్మాన్‌ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపాడు. సల్లూభాయ్ వల్లే ఈ చిత్రం ఇంత ఘనవిజయం సాధించిందని చిరు చెప్పుకొచ్చారు. కాగా చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సంగతి తెలిసిందే. The #GodFather, Megastar @KChiruTweets thanking & Congratulating The Mighty Masoom Bhai aka @BeingSalmanKhan on the Stupendous Success. ❤️#BlockbusterGodfather ?@jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman … Read more

    అదిరిన ‘ఓరి దేవుడా’ ట్రైలర్‌

    అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘ఓరి దేవుడా’ ట్రైలర్‌ విడుదలైంది. దేవుడు, స్నేహం, ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి మనిషీ రిలేట్‌ చేసుకోగలగేలా ట్రైలర్‌ ఆకట్టుకుంది. తమిళంలో ఇప్పటికే ఈ సినిమా ‘ఓహ్‌ మై కడవులే’గా విజయం సాధించింది. ఆ సినిమాలో విజయ్‌ సేతుపతి చేసిన దేవుడి పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేశ్ చేస్తున్నారు.

    ‘ఎందుకో అర్థం కావట్లేదు’: సురేఖ వాణి

    ప్రముఖ టాలివుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి ఎమోషనల్‌ అయ్యారు. ఇటీవల సినిమాల కన్నా సోషల్‌ మీడియాలోనే కనిపిస్తున్న సురేఖ…. తనకు సినిమాలు రావట్లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ‘స్వాతిముత్యం’ సక్సెస్‌ మీట్‌లో ఆమె మాట్లాడారు. ‘ఇటీవల చాలా మంది నేను సినిమాలు మానేశాను అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. నేను సినిమా పిల్లను, సినిమాతోనే ఉంటా. ఇటీవల అవకాశాలు రావట్లేదు. అది ఎందుకో కూడా అర్థం కావట్లేదు’ అని సురేఖ చెప్పుకొచ్చారు.

    విజయ్‌, రష్మిక మాల్దీవ్స్‌ టూర్‌

    వెండితెర జోడీ విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమపై నిరంతరం వార్తలు వస్తూనే ఉంటాయి. వారు మాత్రం దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇవాళ మరోసారి వీరి ప్రేమ వ్యవహారం వార్తల్లోకెక్కింది. వీరిద్దరూ కలిసి మాల్దీవులు టూర్‌ వెళ్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.ఇవాళ ఉదయం రష్మిక ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఫోటోగ్రాఫర్లకు హాయ్‌ చెప్పి లోపలికి వెళ్లిపోయారు. కాసేపటికే విజయ్‌ కూడా ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవుల టూర్‌ వెళ్తున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి.

    యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘హంట్’ టీజర్

    ఈనెల 3వ తేదీన విడుదలైన సుధీర్ బాబు ‘హంట్’ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4.5 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి దూసుకెళ్తుంది. మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    ‘దీంతనానా’ ప్రోమో విడుదల

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ప్రోమో విడుదలైంది. ‘దీంతనానా’ అంటూ సాగే పాటను సిద్ శ్రీరాం ఆలపించారు. ఈ పాటను అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అచు సంగీతం అందిస్తున్నారు.

    వినసొంపుగా ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’ టైటిల్ సాంగ్

    సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్‌క్రైబ్’. నవంబర్ 4వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజగా టైటిల్ సాంగ్ విడుదలైంది. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

    ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న పూర్ణ

    అటు సినిమాతో, ఇటు షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటుంది నటి పూర్ణ. ఇటీవలే పెళ్లికూడా సిద్దమైన ఈ చబ్బీ బ్యూటీ దసరా సందర్భంగా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో సాంప్రదాయ అమ్మాయిగా ఉన్న పూర్ణను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. బయటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: