ప్రభాస్ హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలామంది ఎదురుచూస్తూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం (ఆగస్టు 22) కల్కి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఏకంగా రెండు ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్మురేపడం ఖాయమని అని అంతా భావించారు. అయితే అనుహ్యాంగా ‘రాయన్’ నుంచి కల్కికి గట్టి పోటీ ఎదురైంది. ఈ ఊహించని పరిణామంతో ప్రభాస్ అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
కల్కిని వెనక్కి నెట్టిన రాయన్!
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన రాయన్ చిత్రం జులై 26న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. అదే సమయంలో ఒక రోజు ముందే ‘కల్కి’ కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఇక కల్కి దెబ్బకు రాయన్ వ్యూస్ తగ్గుతాయని సినీ విశ్లేషకులతో పాటు అభిమానులు అంతా భావించారు. అయితే అనూహ్యంగా కల్కికి మించిన వ్యూస్‌తో రాయన్ దూసుకుపోతోంది. ఫలితంగా జాతీయ స్థాయిలో నెంబర్ 1 పొజిషన్లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో రాయన్ తర్వాతి స్థానంతో కల్కి సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
’రాయన్’ పైచేయికి కారణమిదేనా?
ఓటీటీలో కల్కికి మించి రాయన్‌కు ఆదరణ దక్కడానికి ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని చాలామంది థియేటర్లలోనే చూసేశారు. అంతేకాదు రిపీట్ మోడ్‌లో థియేటర్లకు వెళ్లిన వారు సైతం ఉన్నారు. అయితే ‘రాయన్’ అలా కాదు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రొటిన్ రివేంజ్ డ్రామా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చులే అని చాలా మంది సినీ లవర్స్ ఈ సినిమాను చూడకుండా హోల్డ్‌లో పెట్టారు. వారు కోరుకున్నట్లే ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రావడంతో ఒక్కసారిగా ‘రాయన్’ వైపు అంతా మెుగ్గు చూపారు. కల్కిని ఇప్పటికే చూసిన నేపథ్యంలో ముందుగా ‘రాయన్’ను చూసేందుకు ఓటీటీ లవర్స్ ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలోనే ‘రాయన్’కు పెద్ద ఎత్తున వ్యూస్ లభించి జాతీయ స్థాయిలో టాప్‌లో ట్రెండింగ్ అవుతుందని సమాచారం.
‘ధనుష్’ టేకింగ్‌కు బిగ్ సెల్యూట్!
థియేటర్లో కాసుల వర్షం కురిపించిన రాయన్ చిత్రం.. ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ సంపాదిస్తోంది. అయితే రొటిన్ రివేంజ్ డ్రామా వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధనుష్ దర్శకత్వ నైపుణ్యం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపింది. కథనం, స్క్రీన్‌ప్లే, ధనుష్, సందీప్, ఎస్.జే. సూర్య, దుషారా విజయన్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్‌లో ధనుష్ విశ్వరూపమే చూపించాడు. ఫైట్స్ కూడా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. అంతేకాదు డ్రామా, భావోద్వేగాలు కూడా సినిమాలో చక్కగా పండాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా కథను నడిపి ధనుష్ ప్రశంసలు అందుకుంటున్నాడు.
ధనుష్‌ను సర్ప్రైజ్ చేసిన నిర్మాత
ధనుష్ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన రాయన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా అందరి అంచనాలను అందుకుంటూ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో నిర్మాత కళానిధి మారన్ తనదైన శైలిలో ధనుష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు చెక్కులు (డైరెక్టర్, హీరో కావడంతో) చెక్కులు కానుకగా అందజేసి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆ చెక్కుల్లో ఎంత అమౌంట్ ఉందన్న దానిపై స్పష్టత లేదు. దీంతో నెటిజన్లు వారికి ఇష్టమెుచ్చిన సంఖ్యను వేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్