ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లోని మొత్తం 10 వేదికలు ప్రపంచకప్ సమరానికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో అహ్మదాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ఇండోర్, పుణె, ధర్మశాల, లక్నో ఉన్నాయి. మొత్తం 46 రోజుల పాటు మెగా ఈవెంట్ జరగనుంది. అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న వరల్డ్ కప్ ముగియనుంది. ఇక క్రికెట్ అభిమానులకు పండగే పండగ.
టోర్నీ ఫార్మాట్..
ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఇందులో ప్రతి జట్టు మిగతా 9 జట్లతో లీగ్ మ్యాచ్ ఆడనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఇది జరగనుంది. లీగ్ స్టేజి ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కి అర్హత సాధిస్తాయి.
ఫైనల్ వేదిక..
అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 19న ఈ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వ్ డేని కేటాయించారు. అనుకోని కారణాల వల్ల 19న ఫైనల్ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే మరుసటి రోజు(November 20)న ఆటను కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
సెమీఫైనల్స్ ఇక్కడే..
రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు వాంఖడే, కోల్‌కతా వేదికలుగా ఖరారయ్యాయి. ముంబైలోని వాంఖడేలో మొదటి సెమీఫైనల్(November 15), కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ రెండో సెమీఫైనల్(November 15)కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లకు కూడా రిజర్వ్ డే ఉంది. ఇవి కూడా మధ్యాహ్నం 2 గంటలకే ప్రారంభం కానున్నాయి.
ఇండియా Vs పాకిస్తాన్ ఇక్కడే..
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసే సమరం ఇండియా vs పాకిస్తాన్. ముందుగా అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ అపూరూప సమరానికి ఆతిథ్యం ఇవ్వనుంది.
హైదరాబాద్‌కు అవమానం..
టోర్నీ షెడ్యూల్‌లో బీసీసీఐ హైదరాబాద్‌ని నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. అందులోనూ ఇండియా మ్యాచ్ ఒక్కటి కూడా లేకపోవడం హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌ని నిరాశకు గురిచేస్తోంది. పోనీ, ఇతర మ్యాచుల్లోనైనా పెద్ద జట్లు తలపడుతున్నాయా? అంటే అదీ కాదు. పాకిస్తాన్, క్వాలిఫైయర్ 1 మధ్య అక్టోబర్ 6న ఒక మ్యాచ్, న్యూజిలాండ్, క్వాలిఫైయర్ 1 మధ్య అక్టోబర్ 9న రెండో మ్యాచ్, అక్టోబర్ 12న పాకిస్తాన్, క్వాలిఫైయర్ 2 జట్ల మధ్య మూడో మ్యాచ్ జరగనుంది.
వార్మప్ మ్యాచులతో..
ఉప్పల్ స్టేడియంను వార్మప్ మ్యాచ్‌లకు ఉపయోగించనున్నారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌తో పాటు గువాహటి(అస్సాం), తిరువనంతపురం(కేరళ) వేదికల్లో వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్ షెడ్యూల్ ఇదే..
తేదీ | ఇండియా Vs ప్రత్యర్థి జట్టు | వేదిక |
అక్టోబర్ 8 | ఆస్ట్రేలియా | చెన్నై |
అక్టోబర్ 11 | అఫ్గానిస్థాన్ | ఢిల్లీ |
అక్టోబర్ 15 | పాకిస్తాన్ | అహ్మదాబాద్ |
అక్టోబర్ 19 | బంగ్లాదేశ్ | పుణె |
అక్టోబర్ 22 | న్యూజిలాండ్ | ధర్మశాల |
అక్టోబర్ 29 | ఇంగ్లాండ్ | లక్నో |
నవంబర్ 2 | శ్రీలంక | ముంబై |
నవంబర్ 5 | సౌతాఫ్రికా | కోల్‌కతా |
నవంబర్ 11 | నెదర్లాండ్స్ | బెంగుళూరు |
సమవుజ్జీలతో టోర్నీ మొదలు..
అక్టోబర్ 5న వన్డే వరల్డ్‌కప్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్ ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. ఈ రెండు జట్లు 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ పోరులో తలపడ్డాయి. లీగ్ దశ చివరి మ్యాచ్ నవంబర్ 12న జరగనుంది. పుణెలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
* పూర్తి షెడ్యూల్ కోసం ఈ Complete Schedule క్లిక్ చేయండి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!