• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!

    సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్‌ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్‌, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్‌ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్‌ మెుత్తానికి ఇద్దరు యంగ్‌ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా!

    ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star Release Date) ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది. 

    హిట్‌ అయితే కలెక్షన్స్‌ సునామే!

    ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు.

    హిట్‌ కాంబో రిపీట్‌ అవుతుందా?

    ‘టిల్లు స్క్వేర్‌’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్‌ పరుశురామ్‌ పెట్ల, నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ మ్యాన్‌ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. 

    సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్‌’

    హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv