• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైసీపీ గూండల్లారా జాగ్రత్త: పవన్ కళ్యాణ్

    గుంటూరు-ఇప్పంటంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామార్శించేందుకు వచ్చిన పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసుల వ్యవహారతీరుపై పవన్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. మార్చిలో ఇప్పంటం ప్రజలు జనసేనకు భూమిస్తే.. ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. వైసీపీ గూండాల్లారా జాగ్రత్త. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పంటం ఏమైనా కాకినాడనా? రాజమండ్రినా? గుంతలు పూడ్చలేరు, రోడ్డు వేయలేరు కానీ గ్రామంలో రోడ్డు విస్తరణనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామం బయలుదేరిన శ్రీ పవన్ … Read more

    28మంది జనసైనికులపై కేసు

    AP: విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి రోజా కాన్వాయ్‌పై దాడి కేసు, మరో ఘటనకు సంబంధించిన కేసులో 28మంది జనసేన కార్యకర్తలపై కేసు నమోదైంది. దీంతో పలువరు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వైకాపా-జనసేన నేతల మధ్య ఉద్రిక్తతల కారణంగా జనసేన నిర్వహించాల్సిన ‘జనవాణి’ కార్యక్రమాన్ని పవన్ వాయిదా వేశారు. ఆయన్ను నొవాటెల్ హోట‌ల్‌కే పరిమితం చేయడంతో కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ మేరకు హోటల్ చుట్టూ పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు. Our beloved AP police under … Read more

    యాక్టర్స్ కోసమే వర్క్ షాప్

    పవన్ కళ్యాణ్, క్రిష్ కంబినేషన్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ మూవీ వర్క్ షాప్ తాజాగా నిర్వహించారు. అయితే ఈ వర్క్ షాప్‌ను కేవలం నటీనటుల కోసమే నిర్వహించారట. షూటింగ్‌కు వెళ్లేముందు ఆయా పాత్రలు ఎలా నటిస్తాయో ఒక క్లారిటీ వచ్చెనందుకు వర్క్ షాప్ నిర్వహించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

    యూట్యాబ్ లో ‘పవర్ గ్లాన్స్’ సునామీ..!

    ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. పవర్ స్టార్ పుట్టినరోజున విడుదల చేసిన గ్లాన్స్.. యూట్యూబ్ లో సునామీ రేపింది. విడుదల చేసిన 24 గంటల్లోనే కోటి వీక్షణలను దాటేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ పవర్ గ్లాన్స్ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా పవర్ స్టార్ ఎంట్రీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ గ్లాన్స్ వీడియో చూడటానికి Watch On పై క్లిక్ చేయండి.

    థియేటర్ పై దాడికి దిగిన అభిమానులు!

    తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో జల్సా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే పలు చోట్ల అభిమానుల చేష్టలు ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జల్సా స్ట్రీమింగ్ కు అవాంతరాలు ఏర్పడ్డాయని కర్నూలులో థియేటర్ పై కొందరు దాడికి దిగారు. వైజాగ్ లో థియేటర్ లోపల నిప్పుతో భయానకంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. At a theatre in #Kurnool, vandalism by so-called fans of #PowerStar #PawanKalyan disrupting the screening of special shows, after re-release of #Jalsa, … Read more

    పవర్ స్టార్ వద్దన్న సినిమాలు.. ఇండస్ట్రీ హిట్లు..!

    పవన్ కళ్యాణ్.. సినిమా సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. ఆయన సినిమా తీస్తే.. ప్రేక్షకులకు పండగొస్తుంది. చిరునవ్వు నవ్వితే.. అందరి మొఖాల్లో ఆనందమొస్తుంది. మెడపై చేయి నిమిరితే.. అభిమానులకు కొండంత బలమొస్తుంది. సినీ ఇండస్ట్రీలో తనొక ఫైటర్. అమ్మాయిల మదిని దోచే లవర్. విలన్లకు చెమట పుట్టించే ఫయర్.  ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం. అయితే, పవన్ వద్దనుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచాయి. అందులో నటించిన వారికి గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా YouSay … Read more

    రికార్డులు సృష్టిస్తున్న ‘జల్సా’ బుకింగ్స్

    స్పెషల్‌ షో సినిమా బుకింగ్స్‌లో జల్సా నయా రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఇటీవల విడుదలైన కొత్త సినిమాలతో ‘జల్సా’ పోటీ పడుతోంది. హైదరాబాద్‌లో ఇవాళ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తే.. సినిమా గ్రాస్‌ బుకింగ్స్(రూ. కోట్లలో) ఆక్యుపెన్సీ% కోబ్రా 0.196 10.84 కార్తికేయ2 0.165 12.55 సీతారామం 0.072 9.82 జల్సా 0.625 96.78 తమ్ముడు 0.024 28.02 లైగర్‌ 0.091 11.74 బింబిసార 0.017 15.09

    ప‌వ‌న్‌కు అడ్వాన్స్ విషెస్ చెప్పిన మెగాస్టార్

    మెగాస్టార్ చిరంజీవి నేడు ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ సినిమా విడుద‌ల రోజున సెప్టెంబ‌ర్ 2న మా త‌మ్ముడు ప‌వ‌న్ బ‌ర్త్‌డే ఉంది. అడ్వాన్స్‌ హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చెప్పాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాణ సంస్థ పూర్ణోద‌య పిక్చ‌ర్స్ చాలా గొప్ప సినిమాలు చేస్తూ వ‌స్తుంద‌ని తెలిపాడు. దాంతో పాటు త‌న చిన్న‌ప్ప‌టి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ఎక్స్‌పీరియ‌న్స్ చెప్పి అంద‌ర్నీ … Read more

    చిరంజీవి త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్టం: ప‌వ‌ర్‌స్టార్‌

    నేడు మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌ సోద‌రుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. సుధీర్ఘ లేఖ‌తో అన్న‌య్య‌పై ఉన్న అభిమానాన్ని మొత్తం రాసుకొచ్చాడు. చిరంజీవికి త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్టం. ఆయ‌న‌ను అన్న‌య్యా అని పిలిచిన ప్ర‌తీసారి నాకు తెలియ‌ని అనుభూతి క‌లుగుతుంది. ఆయ‌నచెమ‌టోడ్చి సంపాదించిన డ‌బ్బు నుంచి ఎంతోమందికి సాయం చేశాడు. బ్ల‌డ్‌బ్యాంక్, ఐబ్యాంక్, ఇప్పుడు నిర్మించ‌బోయే ఆసుప‌త్రి, కోవిడ్ స‌మ‌యంలో సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌న్ని ఆయ‌న మాన‌వ‌త్నాన్ని చాటుతాయి. చిన్నా, పెద్దా, కులం, మ‌తం వంటి ఎలాంటి … Read more

    ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన డిజిటల్ పోరాటం

    ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్.. ఈరోడ్లు చూడండి అంటూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న జనసేన కార్యకర్తలు తమ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిపై పోస్ట్ లు పెట్టారు. తొలిరోజు ఏలూరు, కడప జిల్లాల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. గుడ్ మార్నింగ్ సీఎం సార్… ఈ రోడ్లు చూడండి#GoodMorningCMSir pic.twitter.com/mQ9hx43iFS — JanaSena Party (@JanaSenaParty) … Read more

    Categories AP