• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu OTT Releases: ఈ వారం (మే 22) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 22 – 28వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు

    మేమ్‌ ఫేమస్‌

    సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ‘మేమ్ ఫేమస్‌’ (Mem Famous) చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ పతాకాలపై శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. సిరిరాశి, మణి, మౌర్య చౌదరి, కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  కథకు తగ్గట్లుగా 30మంది కొత్త నటీనటుల్ని ఎంపిక చేసి సినిమా తీసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 

    మళ్లీ పెళ్లి

    నరేష్‌, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli). ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 26న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగాలు, ఎమోషనల్‌ డ్రామాతో పాటు సంచలనాత్మక కథాంశం ఇమిడి ఉందని డైరెక్టర్‌ తెలిపారు. అలాగే సమకాలీన సామాజిక సమస్యలను కూడా ఈ చిత్రంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నరేష్‌, పవిత్రా లోకేష్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 

    2018

    కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచిన ‘2018’ చిత్రం కూడా ఈ వారం తెలుగులో రిలీజ్ కానుంది. మే 26న ప్రేక్షకులను పలకరించనుంది. జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. 

    మెన్‌ టూ

    నరేష్‌ అగస్త్య కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మెన్‌ టూ’. ఇందులో నరేష్‌కు జోడిగా రియా సుమన్ నటించింది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ, హర్ష, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్‌ ఘంటశాల ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మెన్‌ టూ ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా, ఈ సినిమాలతో పాటు ‘గ్రే’, ‘హీరో ఆఫ్‌ ఇండియా’, ‘జైత్ర’ వంటి చిన్న సినిమాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

    ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు

    కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌

    సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) ఈ వారం ఓటీటీలోకి రానుంది. మే 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తమిళ సూపర్‌ హిట్‌ ‘వీరమ్‌’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా తెలుగు హీరో వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు.

    భేదియా

    బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘భేదియా’ (bhediya) . తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేయనుంది.  ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్‌ కానుంది.

    ‘సిటడెల్‌’ ఆఖరి ఎపిసోడ్‌

    ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’ (Citadel). రిచర్డ్‌ మ్యాడన్‌, ప్రియాంక చోప్రా, జోన్స్‌, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 28 నుంచి వారానికి ఒక ఎపిసోడ్‌ చొప్పున అందిస్తున్నారు. చివరి ఎపిసోడ్‌ మే 26న అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

    TitleCategoryLanguagePlatformRelease Date
    American Born ChineseSeriesEnglishDisney+ HotstarMay 24
    City of DreamsSeriesEnglishDisney+ HotstarMay 26
    Victim/SuspectMovieEnglishNetflixMay 23
    Mothers dayMovieEnglishNetflixMay 25
    FUBARSeriesEnglishNetflixMay 25
    Blood & GoldMovieEnglishNetflixMay 26
    MissingMovieHindiAmazon PrimeMay 24
    Sirf Ek Bandaa Kaafi HaiMovieHindiZee5May 23
    Geetha SubramanyamSeriesTeluguahaMay 23
    Sathi gani rendu ekaraluSeriesTeluguahaMay 26

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv