యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్ సేన్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్‌కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్‌లను తారక్, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుర్ర హీరోలతో క్లోజ్‌గా..
కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చేరారు. యువ విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్ సక్సెస్ మీట్‌కు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్ ఫొటోలు దిగి హల్‌చల్ చేశాడు. మరోవైపు రీసెంట్‌గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్‌లకు తారక్, బాలయ్య అండగా నిలుస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ ఉందా?
ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, నిఖిల్, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్, సిద్ధులనే బాలకృష్ణ, తారక్ ఎంకరేజ్ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్‌కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్, సిద్ధులను ఎంకరేజ్ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్ చేసేందుకు తారక్, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్‌కు పోటీగా..!
విజయ్ దేవరకొండ సోదరులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్‌తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్ చాలా ఒత్తిడి ఫేస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్ మద్దతుతో విష్వక్ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
విష్వక్, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్ నటిస్తున్నాడు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?