• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WTC FINAL: అశ్విన్‌ను పక్కనపెట్టిన రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు.. ఇదేనా అసలు కారణం?

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓవల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ నలుగురు పేసర్లతో పాటు ఒక స్పిన్నర్‌ను మాత్రమే జట్టులోకి తీసుకున్నాడు. కానీ, ఆ స్పిన్నర్ రవీంద్ర జడేజా అని నొక్కి చెప్పాడు. అంటే, వలర్డ్ నంబర్ 1 ర్యాంకర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ని టీమిండియా పక్కన పెట్టింది. పిచ్ కండీషన్లకు బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని రోహిత్ చెప్పినప్పటికీ యాజమాన్య నిర్ణయంపై నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మాజీలు కూడా పెదవి విరుస్తున్నారు. 

    టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అశ్వినే. 13 టెస్టుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. పైగా, ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ వంటి ఎడమ చేతి బ్యాటర్లకు అశ్విన్ సవాలు విసరగలడు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. అశ్విన్‌ను పక్కన పెట్టి టీమిండియా తప్పిదం చేసిందని అభిప్రాయపడ్డాడు. రాను రాను పిచ్‌పై టర్న్ లభిస్తుందని పాంటింగ్ చెప్పాడు. దీంతో లెఫ్ట్ హ్యాండర్లు ఉన్న ఆసీస్ లైనప్‌ని దెబ్బతీయడానికి అశ్విన్ వంటి ఆఫ్ స్పిన్నర్‌ పనికొచ్చేవాడని  పాంటింగ్ సూచించాడు. 

    ‘ఇండియా కేవలం ఫస్ట్ ఇన్నింగ్స్ కోసమే బౌలర్లను తీసుకున్నట్లుంది. రెండో ఇన్నింగ్స్‌కి వచ్చేసరికి పిచ్ పరిస్థితులు మారుతాయి. పిచ్‌పై పచ్చిక ఎక్కువ ఉండటాన్ని నేను గమనించా. కాకపోతే అది కాస్త లోపల ఉంది. ఆట సాగుతున్న కొద్దీ బంతి గమనం మారుతుంటుంది. అశ్విన్‌ని తీసుకోకపోవడం పెద్ద తప్పే’ అని పాంటింగ్ కామెంట్రీలో చెప్పాడు. టెస్ట్ కెరీర్‌లో 94 మ్యాచులు ఆడిన అశ్విన్ 474 వికెట్లు తీశాడు. 

    పిచ్‌కు అతీతుడు అశ్విన్..

    టీమిండియా ఫైనల్ ఎలెవన్ జట్టు సెలక్షన్‌ని భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తప్పుపట్టాడు. ముఖ్యంగా, అశ్విన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిందని సూచించాడు. కేవలం పిచ్ కారణంగా నంబర్ 1 బౌలర్‌ని పక్కన పెట్టడం సబబు కాదని తెలిపాడు. పిచ్‌కు అతీతంగా వికెట్లను రాబట్టగల సత్తా ఉన్న బౌలర్ అశ్విన్ అంటూ కొనియాడాడు. పైగా, మొదటి రోజు టీమిండియా మెరుగ్గా ఆరంభించినప్పటికీ రోజును ఘనంగా ముగించలేక పోయింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ క్రీజులో పాతుకు పోయారు. పరుగులు రాబడుతూ భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. వీరిద్దరూ కలిసి తొలిరోజు ఏకంగా 250 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    అశ్విన్‌ని తుది జట్టులో తీసుకోకపోవడంపై నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఓవల్ మైదానంలో అశ్విన్ పర్ఫార్మెన్స్‌ చేసిన పాత వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ టీమిండియా డిసిషన్‌ని వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు 57 మ్యాచుల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 9 సార్లు విజయం సాధించింది. 20 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. 28 మ్యాచులను డ్రాగా ముగించింది. దీంతో కీలకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై కూడా సందిగ్ధత నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv