• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WTC FINAL: భారత్‌తో తలపడే ఆసీస్ టీమ్ ఇదే

    భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి లండన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ ఛాంపియన్‌పిప్ ఫైనల్ కోసం ఆసీస్ మొత్తం 17 మందితో కూడిన ఆటగాళ్లతో జట్టును కూర్పు చేసింది. జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్(వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ, బోలాండ్, కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్, జోస్ హేజల్‌వుడ్, జోస్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుచానే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టొడిఫై మార్ష్, మాథ్యూ రెన్‌షా, మిచెల్ స్టార్క్.

    @aniphoto

    ఫైనల్‌ కోసం ప్రకటించిన జట్టులోని వార్నర్, హజిల్‌ వుడ్ ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయపడ్డారు. ఆ సిరీస్‌ నుంచి వైదొలిగారు. జూన్‌లో టెస్ట్ ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌ ఉన్న కారణంగా వీళ్లు అందుబాటులోకి వస్తారో లేదో అనే అనుమానం ఉండేది. అటు పాట్ కమ్మిన్స్‌ కూడా కుటుంబ సమస్యల కారణంగా కాస్త మానసిక ఒత్తిడికి గురై తప్పుకోవటంతో స్మిత్ కెప్టెన్సీ చేశాడు. దీంతో ఇందులో చాలామంది జట్టుకు దూరమవుతారని భావించారు. కానీ, వార్నర్ సహా హజిల్‌వుడ్‌ గాయం నుంచి కోలుకోవటంతో జట్టులో స్థానం దక్కింది. ఇక మిచెల్ మార్ష్ కూడా అవకాశం కల్పించారు. 

    @aniphoto

    కమ్మిన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా… స్మిత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. BGTలో సారథ్య బాధ్యతలు అద్భుతంగా నిర్వర్తించాడు స్మిత్. ఒకానొక దశలో టీమిండియా ఓ మ్యాచ్‌లో ఓడిపోయిందంటే అది స్మిత్ కారణంగానే అని చెప్పవచ్చు. ఇలాంటి క్రమంలో వీరిద్దరీ నాయకత్వ లక్షణాలు ఆసీస్‌ను ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది టీమిండియాకు కాస్త ఇబ్బందిగానే మారవచ్చు.

    @aniphoto

    త్వరలోనే బీసీసీఐ కూడా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు జట్టును ప్రకటించనుంది. ఇందులో ఎవరెవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి. రోహిత్‌, కోహ్లీ, పుజారా వంటి మేటి ఆటగాళ్లు కచ్చితంగా జట్టులో ఉంటారు. కేఎల్ రాహుల్‌ సరైన ఫామ్‌లో లేకపోవడంతో అతడి ప్లేస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బుమ్రాకి గాయం ఇంకా మానలేదు. అతడు ఫైనల్ జట్టులో ఉండే అవకాశమే లేదు. జడేజా, అక్షర్ పటేల్‌, అశ్విన్ వంటి ఆల్‌రౌండర్లకు చోటు దక్కవచ్చు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్‌కు కూడా కచ్చితంగా చోటు కల్పిస్తారు. బౌలింగ్ విభాగంలోనే ఎవరికి అవకాశం కల్పిస్తారో తెలియాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv