• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారతీయ జెండా ఎగురవేసిందుకు దాడి

  [VIDEO](url):ఆస్ట్రేలియాలో ఖలీస్థానీలు రెచ్చిపోయారు. వీధుల్లో భారత జాతీయ జెండాను ఎగురవేసినందుకు వారిపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలు పట్టుకుని భారతీయ జెండాను పట్టుకున్నవారిపై రాడ్లతో దాడి చేశారు. దీనిపై పలువురు భారతీయులు స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకుని తగు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. Indians from the Hindu community beaten up by Khalistanis for waving Indian flag on the streets of Australia Khalistani Terrorism is a ticking bomb #KhalistanReferendum pic.twitter.com/vb5RrszPE7 … Read more

  హిందూ దేవాలయాలపై దాడులు

  ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దుండగుల దాడులను అక్కడి భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. కారమ్‌డౌన్స్‌లోని విష్ణు ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు భారత్ వ్యతిరేక నినాదాలు గోడలపై రాశారు. ‘హిందుస్థాన్ ముర్దాబాద్’, ‘ఖలిస్థాన్ జిందాబాద్’, ‘మోడీ హిట్లర్’ వంటి వ్యాఖ్యలు కనిపించడం కలకలం రేపింది. దీంతో కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. విద్వేషపూరితంగా ఉన్న ఈ వ్యాఖ్యలు శిక్షార్హమైనవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషన్ కూడా ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తు కొనసాగుతుందని హామీ ఇచ్చింది.

  ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్

  ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ డానియెల్ క్రిస్టియాన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రిస్టియాన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. ఆసీస్ తరఫున 20 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 388 పరుగులు, 33 వికెట్లు సాధించాడు. 2021 తర్వాత క్రిస్టియాన్ ఆసీస్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక అతడు ఐపీఎల్‌లో కూడా పలు జట్ల తరఫున ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్, ఆర్సీబీ, ఢిల్లీ డేర్ డెవిల్స్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

  ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి టీమిండియా

  ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. 3960 పాయింట్లతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో కొనసాగుతోంది. మరో 115 రేటింగ్ పాయింట్లు సాధించింది. టీమిండియా తర్వాత స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి.

  భారత్‌తో టెస్ట్ సీరీస్; ఆసీస్ జట్టు ఇదే

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సీరీస్‌కు భారత్‌తో తలపడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 18 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. 3 ఏళ్ల తర్వాత పీటర్ హ్యాండ్స్‌కూంబ్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మొత్తం 4 టెస్టుల సీరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు జరగనుంది. ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అగర్, బోలాండ్, క్యారీ, గ్రీన్, హ్యాండ్స్‌కూంబ్, రెన్‌షా, స్మిత్, స్టార్క్, స్వెప్సన్, వార్నర్, హేజిల్‌వుడ్, హెడ్, ఖవాజా, లబూషేన్, లియాన్, మోరిస్, ముర్ఫీలను బోర్డు ఎంపిక చేసింది.

  జంపా మన్కడింగ్.. అశ్విన్‌లా చేయబోయి..

  ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మన్కడింగ్ చేయబోయి బోల్తాకొట్టాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్‌బోర్న్ స్టార్స్, మెల్‌బోర్న్ రెనెగ్రేడ్స్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ జంపా ప్రత్యర్థి బ్యాటర్ రోజర్స్‌ను [మన్కడింగ్](url) చేయబోయాడు. రోజర్స్ క్రీజు దాటిన వెంటనే జంపా బెయిల్స్‌ను గిరాటేశాడు. కానీ అంపైర్ ఔటివ్వలేదు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ కూడా ఔట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. రూల్స్ ప్రకారం బౌలింగ్ వేసేటప్పుడు జంపా భుజం ముందుకు వంగి ఉండటంతో రోజర్స్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. Woweee 😱 Rogers survives … Read more

  ఆస్ట్రేలియాలో ‘అండర్‌వేర్ హీరో’

  ఆస్ట్రేలియాలో అండర్‌వేర్ హీరో ప్రత్యక్షమయ్యాడు. చోరీకి వచ్చిన దొంగల్ని పట్టించేందుక యజమాని వారిని వెంబడించాడు. అయితే, ఆ సమయంలో లో చెడ్డీ తప్ప మరేమీ ధరించకపోవడం గమనార్హం. స్టీవ్ మిడిల్టన్ ఇంట్లో నిద్రిస్తుండగా ఓ భవన నిర్మాణ కార్మికుల సమూహం దొంగతనానికి వచ్చింది. ఇది గమనించిన స్టీవ్.. వెంటనే లేచాడు. అయితే నిద్రిస్తున్న సమయంలో శరీరంపై దుస్తులేమీ లేకపోవడంతో కేవలం లోదుస్తులు మాత్రమే వేసుకుని వచ్చాడు. ‘ఎలాగైనా వారిని పట్టించేందుకు ప్రయత్నించా’ అని స్టీవ్ వెల్లడించాడు. కాగా, ఈ వీడియో చూసిన వారంతా ‘అండర్ … Read more

  ఆస్ట్రేలియాలో భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు

  ఆస్ట్రేలియాలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆస్ట్రేలియా ప్రముఖ ప్రాంతాలు త్రివర్ణ పతాక వెలుగుల్లో కాంతులీనాయి. ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య బలమైన బంధానికి ఇదే చిహ్నమంటూ భారత్‌ ఆస్ట్రేలియా హై కమిషనర్‌ బేరీ ఓ ఫారెల్‌ ట్విట్టర్‌లో ఫోటోలు షేర్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా భారత ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది.

  సిడ్నీ తీరంలో కోవిడ్ కలకలం.. షిప్‌లో 800 కేసులు

  ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గినట్లే కనిపించినా.. మరోసారి అప్రమత్తంగా ఉండాలని సూచించే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దాదాపు 800 మంది కరోనా బాధితులతో ఉన్న ఒక క్రూజ్ నౌక ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన ఈ షిప్‌లో 4,600 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌ ఉంచామని అధికారులు తెలిపారు. 2020లో రూబీ ప్రిన్సెస్‌ క్రూజ్‌ నౌకలో వైరస్ విజృంభించింది. అప్పుడు ఆ నౌకలో 900 మంది వైరస్ బారినపడ్డారు. 28 మంది మరణించారు. … Read more

  క్రికెటర్ గుణతిలకకు బెయిల్ నిరాకరణ

  రేప్ కేసులో ఆస్ట్రేలియాలో అరెస్టైన ధనుష్క గుణతిలక వ్యవహారంలో మరో విషయం వెలుగు చూసింది. బాధిత మహిళపై గుణతిలక దారుణంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పలుసార్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆమె గాయపడిందని, దీంతో ఆమెకు స్కానింగ్ తీయాల్సి వచ్చిందని అక్కడి పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాగా అతని తరఫున న్యాయవాది అమర్నాధ్ బెయిల్ కోరగా అక్కడి కోర్టు తిరస్కరించింది. గుణతిలక అరెస్ట్ కావడంతో.. అతడిని అక్కడే వదిలేసి శ్రీలంక టీమ్ స్వదేశానికి చేరుకుంది.