YouSay Telugu
  • Home
  • News
  • Telugu Movies
  • Web Stories
  • Yousay App
    • Terms & Conditions
    • Privacy Policy
    • Intermediary Compliance
    • Copyright Infringement
    • Editorial Guidelines
    • Funding Information
  • All Categories
English
YouSay Telugu
  • Home
  • News
  • Telugu Movies
  • Web Stories
  • Yousay App
    • Terms & Conditions
    • Privacy Policy
    • Intermediary Compliance
    • Copyright Infringement
    • Editorial Guidelines
    • Funding Information
  • All Categories
English
YouSay Telugu
English Open In App
  • Home
  • News
  • Telugu Movies
  • Web Stories
  • Yousay App
  • Cricket
  • Lifestyle
  • People
  • Recommended
  • Technology
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Home Featured Articles

    2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌

    Sateesh by Sateesh
    December 29, 2022
    in Featured Articles, Politics, Recommended
    0
    2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌
    0
    SHARES

    కొత్త జిల్లాల ఏర్పాటు. వాటి పేర్లపై రచ్చ.  హైకోర్టులో నూతన జడ్జీల ప్రమాణం. మూడు రాజధానులపై రగడ. ఆశావాహులు, అసంతృప్తుల మధ్యే కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. అల్లూరి జిల్లాలో 30 అడుగుల విగ్రహం. 

    అదే సందిగ్ధతలో పోలవరం. టీడీపీ, వైకాపా మధ్య పెరుగుతున్న అంతరం. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వైరం. సంక్షేమానికి అప్పులు. మాదక ద్రవ్యాల సరఫరా కట్టడిలో విఫలం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు, సమస్యలు, పోరాటాలు మధ్య ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగింది.

    కొత్త జిల్లాలు

    ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ప్రారంభంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలను 26కు పెంచుతూ మంత్రి మండలి ఆమోదించింది.

    ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా చేశారు. అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించారు. ఉగాది నుంచి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. 

    DGP టూ APPSC

    ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ను APPSC ఛైర్మన్‌గా నియమించారు. శాంతిభద్రతలను సరిగా అదుపుచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, సవాంగ్‌ జగన్‌కు సన్నిహితుడు. ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించి తర్వాత పూర్తిస్థాయి డీజీపీగా నియమించారు. 

    కొత్త న్యాయమూర్తులు

    ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు వచ్చారు. 37 మంది న్యాయమూర్తులు అవసరం ఉండగొ కొలిజీయం ఈ ఏడాది 14 మందిని ప్రతిపాదించింది. ప్రారంభంలో ఏడుగురు, ఆగస్టులో మరో ఏడుగురు నియమించబడ్డారు. 

    రాజధాని అమరావతే!

    ఆంధ్రప్రదేశ్‌ రాజధాని సమస్య కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ముందుకు సాగకపోవటం, అమరావతి రైతుల పోరుబాట కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు మంత్రులు మళ్లీ బిల్లు తెస్తామని చెప్పటం కొసమెరుపు. 

    ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు రాజధాని అమరావతే అని సంచలన తీర్పు ఇచ్చింది. శాసన, కార్య నిర్వాహక,  న్యాయవ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకీ లేదని తేల్చి చెప్పింది. 

    మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి

    ఈ ఏడాది ప్రారంభంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయారు. గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. జిమ్ చేస్తుండగా ఒక్కసారి గుండె ఆగిపోవటంతో తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వంలో ఆయనకు ఉన్న పేరుతో సంగం బ్యారెజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టి గెజిట్ విడుదల చేశారు. 

    ప్రపంచంలో అతిపెద్ద ఐఆర్‌ఈఎస్ ప్రాజెక్టు

    ఇంటిగ్రేటేడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు పైలాన్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇది. రూ. 30,000 కోట్లతో చేపట్టారు. మిత్తల్ కంపెనీ ఈ ప్రాజెక్టుతో వ్యాపార ఒప్పందం చేసుకుంది. 

    కొత్త మంత్రివర్గం

    ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. కొత్త, పాత కలయికలో సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ వంటి వారికి నిరాశెే ఎదురయ్యింది. వారికి మళ్లీ పదవులు దక్కలేదు. 

    విడుదల రజినీ, రోజా, తానేటి వనిత వంటి వారికి మంత్రి పదువులు వరించాయి. అంతకముందు మాదిరిగానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఒక్కో సామాజిక వర్గానికి ఒకరిని ఎంచుకున్నారు. హోంశాఖను కూడా మళ్లీ ఎస్సీ వర్గానికి చెందిన వారికే కేటాయించారు. 

    30 అడుగుల్లో అల్లూరి విగ్రహం

    మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 

    దమ్ముంటే నన్ను చంపండని గర్జించిన అల్లూరి స్ఫూర్తిగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది ఐక్యత అవసరమన్నారు.

    సంగం, నెల్లూరు బ్యారేజీలు ప్రారంభం

    లక్ష ఎకారలకు నీరు అందించే సంగం, నెల్లూరు బ్యారెజీలను 140 ఏళ్ల కిందట బ్రిటీష్ వాళ్లు నిర్మించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై సంగం దగ్గర నిర్మీించారు. దీనికి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 

    కొత్త సీఎస్‌

    ఆంధ్రప్రదేస్‌ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహార్ రెడ్డి నియామకం అయ్యారు. 2024 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 

    సీఎస్‌గా అవకాశం రావటంతో ఆయన స్థానంలో సీఎంఓగా పూనం మాలకొండయ్యను ప్రభుత్వం నియమించింది. సీఎస్‌గా పదవి విరమణ చేసిన సమీర్ శర్మను ముఖ్యమంత్రి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియామకం అయ్యారు.

    అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌

    మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి సహా అతడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనం రేపింది. గతంలో అయ్యన్న పాత్రుడి ఇంటి దగ్గర ప్రహారి గోడ విషయంలో వివాదం చెలరేగింది. 

    పంటపొలం ఆక్రమించి గోడ కట్టారనే కూల్చివేతకు ప్రయత్నించగా ఆయన అడ్డుకున్నారు. 

    కోర్టులో కేసు వేయటంతో ఆయనకు సానుకూలంగా తీర్పు వచ్చింది. కానీ, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారని అదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడం వివాదాస్పదం అయ్యింది.

    లోకేశ్‌పై దాడి

    గుంటూరు జిల్లా తుమ్మపూడిలో తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం కలకలం రేపింది. దీనికి ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 

    బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌పై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఇందులో ఓ ఎస్సై కూడా గాయపడ్డారు. వైకాపా శ్రేణులపనే అని తెదేపా ఆరోపించగా..మనుషుల్ని పెట్టుకొని చేశారంటూ వైఎస్సార్‌సీపీ కౌంటర్ ఇచ్చింది.

    ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్పు

    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఏపీ ప్రభుత్వం మార్చింది. డాక్టర్ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీతో పిలవాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఎన్టీఆర్‌ పేరును మార్చడంపై తెదేపా సహా పలువురు బాహాటంగానే విమర్శలు చేశారు.

    ఇదేం ఖర్మ రాష్ట్రానికి

    వైసీపీ పాలనలో లోపాలను ఎత్తిచూపి ప్రజల్లో చైతన్యం నింపేందుకు తెలుగుదేశం పార్టీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తుంది.

     ఏలూరు జిల్లాలో ప్రారంభించి 50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలు సుమారు 2 కోట్ల మంది ప్రజల్ని కలిసి కష్టాలు తెలుసుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు.

    మాచర్లలో రచ్చ

    పోలీసులు వెంటనే 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపు చేశారు.దీనికంతటికి కారణం ఆ ప్రాంతం తెదేపా ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మా రెడ్డి కారణం అని వినికిడి. 

    పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలోనే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. వైకాపా, తెదేపా శ్రేణులు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో మాచర్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

    పవన్ – చంద్రబాబు పొత్తు!!

    ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ కలవని పవన్ కల్యాణ్, చంద్రబాబు విశాఖ నోవాటెల్‌లో సమావేశం అయ్యారు. అంతకముందున్న షెడ్యూల్ ప్రకారం విశాఖలో పవన్ పర్యటనకు వచ్చారు. కానీ, పోలీసులు అతడిని అడ్డుకున్నారు. 

    హోటల్‌ నుంచి కదలకుండా మోహరించారు. అక్కడకు వెళ్లిన చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై పోరుకు కలిసి నడుస్తామనడం హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరు మళ్లీ పొత్తు పెట్టుకుంటారని చర్చ జరిగింది.

    ఇప్పటం ఇళ్ల లొల్లి

    మంగళగిరిలోని ఇప్పటంలో జనసేన సభ పెట్టుకోవటానికి భూములు ఇచ్చినవారి ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించారు. కావాలనే అధికార పార్టీ ఆగడాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

    Tags: AmaravatiandhrapradeshChandrababuNaidudgpGoutham ReddyGoutham SavangGudivada AmarnathjaganJanaseenalokeshntrpawan kalyanroja

    Recommended

    లైగర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అంతా సిద్ధం

    August 20, 2022

    కొత్త ఫీచర్లు తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రాం

    August 17, 2022

    Don't miss it

    AP

    సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేత

    January 27, 2023
    AP

    బాసరలో వసంత పంచమి వేడుకలు; పోటెత్తిన భక్తులు

    January 27, 2023
    Celebrities

    విష్ణుప్రియ ఇంట్లో విషాదం

    January 27, 2023
    Cricket

    ఇంటివాడైన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్

    January 27, 2023
    Hyderabad

    నేటి నుంచే టీచర్ల బదిలీలు

    January 27, 2023
    AP

    పెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం

    January 27, 2023
    YouSay Telugu

    YouSay News & Entertainment
    (A division of KTree Computer Solutions India (P) Ltd) Block C, 1st Floor, Sanali Info Park,
    8-2-112/120/1, Venkat Nagar,
    Road No. 2, Banjara Hills, Hyderabad 500034
    + 91 (40) 66747260 / 61
    • Terms & Conditions
    • Privacy Policy
    • Intermediary Compliance
    • Copyright Infringement
    • Editorial Guidelines
    • Funding Information
    Powered By
    KTree Computer Solutions India (P) Ltd Block C, 1st Floor, Sanali Info Park,
    8-2-112/120/1, Venkat Nagar,
    Road No. 2, Banjara Hills, Hyderabad 500034
    + 91 (40) 66747260 / 61

    © 2021 KTree

    No Result
    View All Result
    • Home
    • News
    • Telugu Movies
    • Web Stories
    • Yousay App
      • Terms & Conditions
      • Privacy Policy
      • Intermediary Compliance
      • Copyright Infringement
      • Editorial Guidelines
      • Funding Information
    • All Categories
    • Cricket
    • Lifestyle
      • Health
      • Relationships
    • People
    • Recommended
    • Technology
      • Apps
      • Gadgets
      • Tech News

    © 2021 KTree

    Go to mobile version