టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూ.ఎన్టీఆర్ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ తారలు సైతం ఎన్టీఆర్ నటనను మెచ్చుకున్నారు. గ్లోబర్ స్టార్‌గా ఎదిగిన తారక్‌తో సినిమాలు చేసేందుకు హాలీవుడ్ దర్శకులు సైతం ఆసక్తి బహిరంగంగానే తమ ఆసక్తిని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వార్-2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్ స్క్రీన్ చేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి జాతీయ మీడియా పలు కథనాలు రాసింది. అది చూసిన తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తారక్.. తనని తాను తగ్గించుకుంటున్నాడా?
ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి చేయనున్న వార్ – 2 చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్’లో భాగంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ రోల్లో కనిపిస్తాడని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అంతేగాక ఈ పాత్ర కోసం రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. RRRలో తమ హీరో కంటే రామ్‌చరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ వార్ 2 సినిమాలోనూ అదే పరిస్థితి రిపీట్ అవుతుందని కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం వల్ల సినిమాలో హృతిక్ పాత్రే హైలైట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ హీరోదే పైచేయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
రెమ్యూనరేషన్ తక్కువే!
ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే RRR చిత్రానికే ఎన్టీఆర్ 45 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత చేయబోయే చిత్రాలకు ఎన్టీఆర్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే టాప్ 5 స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ చేరిపోయాడని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.30 కోట్లకే వార్-2 చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్నట్లు కథనాలు రావడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా తారక్‌ను అభిమాన హీరోను నెగిటివ్ రోల్లో చూడటానికి తమ మనసు అంగీకరించడం లేదని మదనపడుతున్నారు. అయితే బాలీవుడ్‌లోని అగ్ర నటులతో పోలిస్తే తారక్ రెమ్యూనరేషన్ ఎక్కువనే చెప్పాలి.
లాభాల్లో షేర్..
ఎన్టీఆర్ రెమ్యూనరేషన్‌కు సంబంధించి మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ నేరుగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా వార్-2 సినిమా లాభాల్లో షేర్ తీసుకునేలా డీల్ కుదిరి ఉండొచ్చని మరికొన్ని మరికొన్ని వార్త కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే వార్ 2 సినిమా కోసం తారక్ కంటే ముందు ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించారని గతంలో ప్రచారం జరిగింది. వారు రిజెక్ట్ చేయడం వల్లే తారక్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను యాష్ రాజ్ నిర్మాణ సంస్థ ఛైర్మన్ ఆదిత్య చోప్రా ఖండించారు. తాము ఎవరినీ సంప్రదించలేదని, తారక్‌ను దృష్టిలోపెట్టుకునే ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. దీంతో ఆ దుష్ప్రచారాలకు చెక్ పెట్టినట్లైంది. ఇకపోతే వార్ 2 సినిమా నవంబర్‌లో పట్టాలెక్కనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
శరవేగంగా NTR 30 షూటింగ్
ప్రస్తుతం NTR 30 సినిమా షూటింగ్లో తారక్ బిజీబిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. NTR 30 అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు రత్నవేలు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యవసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!