• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • South-Indian Films In Rs 500 Crore Club: దక్షిణాదిలో రూ.500 కోట్లు క్రాస్‌ చేసిన చిత్రాలు.. ఓ లుక్కేయండి!

    జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Dveara) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి నాలుగు రోజుల్లో రూ.325 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. అయితే సౌత్‌ నుంచి వచ్చిన పలు చిత్రాలు ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఎన్ని రోజుల్లో రూ.500 కోట్లు సాధించాయి? ఓవరాల్‌ కలెక్షన్స్ ఎంత? ఆయా చిత్రాల డైరెక్టర్లు ఎవరు? ఏ స్టార్‌ హీరో అందులో నటించాడు? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)

    ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్లు కొల్లగొట్టి సత్తా చాటింది. ఓవరాల్‌గా రూ.1200 కోట్లను తన ఖాతాలో వేసుకొని ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

    యానిమల్‌ (Animal)

    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెలుగు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఆరు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 917.82 కోట్లను కొల్లగొట్టి సత్తా చాటింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది. 

    సలార్‌ (Salaar)

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవరాల్‌గా రూ.700 కోట్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ నటించారు. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది. 

    RRR

    రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR‘ పలు రికార్డులను కొల్లగొట్టింది. తొలి మూడు రోజుల్లోనే రూ.570 కోట్లను కొల్లగొట్టి ప్రశంసలు అందుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం.

    కేజీఎఫ్‌ 2 (KGF 2)

    కన్నడ నటుడు యష్‌ (Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్‌-2’ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాల సక్సెస్‌తో డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, హీరో యష్‌ పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. 

    బాహుబలి (Baahubali)

    ప్రభాస్‌ హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్‌ గతినే మార్చేసింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్‌ సత్తా ఏంటో తొలిసారి దేశానికి తెలిసింది. ఈ చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. మెుత్తంగా రూ.600-650 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. 

    బాహుబలి 2 (Baahubali 2)

    బాహుబలి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టి దేశంలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. 

    రోబో 2.0 (Robo 2.0)

    రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ శంకర్‌ (Director Shankar) తెరకెక్కించిన ‘రోబో 2.0’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లనే సాధించింది. ఈ మూవీ తొలి 7 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. మెుత్తంగా రూ.700 – 800 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. 

    జవాన్‌ (Jawan)

    బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ (Director Atlee) తెరకెక్కించిన జవాన్‌ చిత్రం గతేడాది సెప్టెంబర్‌లో రిలీజై బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం 4 రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లను సాధించింది. మెుత్తంగా రూ.1,148.32 కోట్లను బాక్సాఫీస్‌ వద్ద రాబట్టింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv