• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Spirit: ప్రభాస్‌ సరసన మృణాల్‌ ఠాకూర్.. పిక్స్ వైరల్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో ‘స్పిరిట్‌’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ కెరీర్‌ పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ‘ (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌ కాగా, సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్‌‘ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో వీరి కాంబోలో రానున్న ‘స్పిరిట్‌’ (Spirit) ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకూ స్పిరిట్‌కు సంబంధించి ఎన్నో గాసిప్స్‌ బయటకు వచ్చాయి. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్ అయినట్లు తెలుస్తోంది. 

    మృణాల్‌తో ప్రభాస్‌ రొమాన్స్‌!

    ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రానున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్‌ థాకూర్‌ (Mrunal Thakur) ఫిక్స్ అయినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సందీప్‌ రెడ్డి వంగాతో ఆమెకు అగ్రిమెంట్‌ కూడా కుదిరిందని బజ్‌ వినిపిస్తోంది. తొలుత ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలించిన సందీప్‌.. ఫైనల్‌గా సీతారామం బ్యూటీకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు పెయిర్‌గా ఆమె అయితేనే చక్కగా బాగుటుందని మూవీ టీమ్‌ భావించినట్లు సమాచారం. పైగా ఈ జోడీ ఇప్పటివరకూ కలిసి నటించకపోవడంతో తెరపై చూసిన వారికి ఫ్రెష్‌గా అపిస్తుందని మేకర్స్ అనుకున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది. 

    ఫుల్‌ స్వింగ్‌లో స్క్రిప్ట్‌ వర్క్‌..

    ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా ఫోకస్‌ మెుత్తం ‘స్పిరిట్‌’ (Spirit) పైనే ఉంది. ఈ మూవీ ప్రీ – ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ చూపిన విధంగా ప్రభాస్‌ను ఆయన ప్రభాస్‌ను రీ ఇంట్రడ్యూస్‌ చేస్తారని లేటెస్ట్‌ సమాచారం అందుతోంది. ఇక స్పిరిట్‌కు సంబంధించి మరో పోస్టర్‌ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ‘పోలీసులలో మంచి వారుంటారు.. చెడ్డవారుంటారు.. అలాగే అతడూ ఉన్నాడు’ అంటూ రక్తంతో తడిసిన పోలీసు మెడల్‌ పోస్టర్‌ సైతం నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు అప్‌డేట్స్‌తో స్పిరిట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. 

    ప్రభాస్‌ – మృణాల్ ఏఐ పిక్స్‌ వైరల్‌

    ప్రభాస్‌తో మృణాల్‌ జతకట్టడం ఖాయమంటూ నెట్టింట ప్రచారం మెుదలు కావడంతో డార్లింగ్‌ ఫ్యాన్స్ అలెర్ట్‌ అయ్యారు. ‘స్పిరిట్‌’లో వారి జోడీ ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించి ఏఐ జనరేటేడ్‌ పిక్స్‌ను నెట్టింట అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఖాకీ డ్రెస్‌లో ప్రభాస్‌, బ్లాక్‌ శారీలో మృణాల్ ఉన్న ఏఐ పిక్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే ఎదురెదురుగా ప్రభాస్, మృణాల్‌ నిలబడి ఒకరి కళ్లల్లో మరొకరు చూసుకుంటున్న ఫిక్‌ కూడా మెప్పిస్తోంది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.

    విలన్స్‌గా బాలీవుడ్‌ జంట

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారాడు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు స్పిరిట్‌లోనూ విలన్‌గా అతడే నటించబోతున్నట్లు సమాచారం.  ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సైఫ్‌ అలీఖాన్‌ భార్య కరీనా కపూర్‌ (Kareena Kapoor) కూాడా నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు రూమర్లు ఉన్నాయి. అదే నిజమైతే ‘స్పిరిట్‌’పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv