టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ముఖ్యంగా కొద్దిమంది హీరోలు, డైరెక్టర్ల కాంబో అంటే ఆడియన్స్ పిచ్చెక్కిపోతారు. ప్రభాస్-రాజమౌళి, త్రివిక్రమ్-పవన్ కల్యాణ్, తారక్ – కొరటాల శివ, అల్లు అర్జున్-సుకుమార్, హరీష్ శంకర్-రవితేజ కాంబోలో చిత్రం అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మరో క్రేజీ కాంబోలో కూడా టాలీవుడ్‌లో ఉంది. వాస్తవానికి ఈ కాంబినేషన్స్‌లో అదే టాప్ అని చెప్పవచ్చు. అదే బన్నీ-త్రివిక్రమ్ కాంబో. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అది పక్కాగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబోలో ఫోర్త్ ఫిల్మ్ కూడా ఉండనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ బయకొచ్చాయి.
ముహోర్తం ఫిక్స్!
అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ కోసం ఆడియన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ముహోర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుండటంతో ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారానే తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో అగుడుపెడతారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆ ఇద్దరిలో ఎవరు!
బన్నీ-త్రివిక్రమ్ చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపిక కూడా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలియా భట్ (Alia Bhatt)లలో ఒకర్ని బన్నీకి జోడీగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నేపథ్యంలో జాన్వీకి తెలుగులో క్రేజ్ ఏర్పడింది. దీంతో జాన్వీ వైపే త్రివిక్రమ్ మెుగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు బన్నీ సరసన ఆలియా కంటే జాన్వీనే బాగా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే బాలీవుడ్‌లో జాన్వీ కంటే ఆలియాకు ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల ఆమెను తీసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలియాను తీసుకుంటే పాన్ ఇండియా స్థాయిలో కలిసిరావొచ్చని కూడా భావిస్తున్నారట. హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
హ్యాట్రిక్ హిట్స్
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో గతంలో మూడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపొందిన ‘జులాయి’(Julayi), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/o Satyamurthy), ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. హీరో అల్లు అర్జున్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఈ మూడు కూడా హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌గా సగటు సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీరి కాంబోలో రానున్న నాల్గో చిత్రం కూడా ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత రికార్డులను ఈ మూవీ చెరిపేయాలని ఆశిస్తున్నారు.
‘పుష్ప 2’తో బిజీ బిజీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో ‘పుష్ప 2’ (Pushpa 2) చేస్తున్నాడు. డిసెంబర్ 6న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (Pushpa)కు సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ వ్యయంతో నిర్మించిన ఓ సెట్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పతాక సన్నివేశాలను ఈ సెట్‌లో షూట్ చేస్తున్నట్లు సమాచారం. హీరో బన్నీతో పాటు కీలక నటులంతా ఈ షూట్‌లో పాల్గొంటున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్