• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!
    Sania mirza retirement: భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు.. సానియా విజయ ప్రస్థానం
    Pele: 20వ శతాబ్దపు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే
    లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
    See More

    శివ బ్యాటింగ్ తీరు బాగుందన్న హర్భజన్ సింగ్‌

    దేశంలో ప్రతిభావంతమైన క్రికెటర్లకు కొదవలేదు. పెద్ద నగరాల నుంచి గ్రామాల దాకా అద్భుతమైన ఆటగాళ్లు వెలుగుకి వస్తున్నారు. ఇటీవల డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(DCCI) ట్వీట్ చేసిన వీడియోను భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్‌ పంచుకున్నారు. వీడియోలో శివ శంకర అనే ఆటగాడు నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూడవచ్చు. ఈ సందర్భంగా అతని షాట్ల రేంజ్ చాలా బాగుందని హర్భజన్ మెచ్చుకున్నారు. Meet #GSShiva.The range and class in his strokes are second … Read more

    బాల్ ఆఫ్ ది సెంచరీ 2.0 రికార్డు క్రియేట్ చేసిన యాసిర్ షా

    1993లో షేన్ వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ మళ్లీ ప్రేక్షకులకు గుర్తుచేసింది. ఇటీవల శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచులో పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో ఓ బాల్ అచ్చం షేన్ వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ లాగా ఉందని పలువురు అంటున్నారు. ఈ సంఘటన 56వ ఓవర్‌లో జరిగింది. దీంతో శ్రీలంక బ్యాట్స్‌మన్ 76 పరుగుల వద్ద సంచలనాత్మక ఇన్నింగ్స్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ బాల్ స్పిన్ తిరిగిన విధానంను షేన్ వార్న్ బౌలింగ్ తీరుతో … Read more

    కలిసి మ్యాచ్ వీక్షించిన ధోనీ, రైనా..ఆ వార్తలకు చెక్

    సురేష్ రైనా & MS ధోనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇద్దరు ఒక్కటై లార్డ్స్ భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ వీక్షించారు. రెండో వన్డే చూసేందుకు లండన్ చేరుకున్నారు. ఒకే కారులో స్టేడియానికి వచ్చిన ధోనీ, రైనా కలిసి ఆటను ఆస్వాదిస్తు ఎంజాయ్ చేశారు. వీరిని చూసిన అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. గతంలో వీరిద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. CSK అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది. The Reunion of Brothers! ?THALA ? thala! … Read more

    కోహ్లీకి మద్దతుగా నిలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్

    భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2019 నుంచి ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. దారుణమైన బ్యాటింగ్ తీరుతో నిరాశపరుస్తున్నాడు. నిన్నఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో కూడా 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఫామ్‌లో లేని విరాట్‌ కోహ్లీకి పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం మద్దతు తెలిపాడు. గతం గడిచిపోతుంది. స్టే స్ట్రాంగ్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి సపోర్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. విరాట్ కు మద్దతుగా నిలిచినందుకు బాబర్ … Read more

    20 ఏళ్ల తర్వాత అవమానించిన రోజే గంగూలీకి ఇంగ్లాండ్ సన్మానం..

    ఏ రోజైతే బ్రిటీష్ మీడియా, ఆ దేశ క్రికెట్ అభిమానులు  భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీని పొగరుబోతు అని అవమానించిందో సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సాక్షాత్తూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశ పార్లమెంటులోనే దాదాను సత్కరించింది. లెజండరీ క్రికెటర్ అని స్తుతించింది. అసలు గంగూలీపై బ్రిటీష్ మీడియా ఎందుకు చులకనగా మాట్లాడింది. ఇప్పుడెందుకు ఆ దేశం గంగూలీని సన్మానించిందో ఓసారి గతాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. భావోద్వేగాలు రగిల్చిన నాట్ వెస్ట్ ఫైనల్ 2002 జులై 13న లార్డ్స్​ నాట్ వెస్ట్ సిరీస్ … Read more

    వయసు ఓ సంఖ్య మాత్రమే… 94 ఏళ్ల వయసులో భగవానీ దేవి సంచలనం

    94 ఏళ్ల వయసులో ఏం చేస్తాం.. ఇంకేం సాధిస్తాంలే…అని అనుకోలేదు ఆ బామ్మా. పరుగులో పోటీపడి పసిడి పతకాన్ని ఒడిసిపట్టారు 94 ఏళ్ల భగవానీ దేవి దాగర్. ఫిన్ లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2002లో సంచలనం సృష్టించారు. ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఓ స్వర్ణం సహా రెండు కాంస్య పతకాలు గెలిచారు. ఆమె సాధించిన విజయం నేటి యువ తరానికి స్ఫూర్తి దాయకం. ఇంతకు ఎవరీ భగవానీ దేవి? మనలో … Read more

    రిషభ్ పంత్: ధోనీ వారసుడా? అంతకు మించి అదరగొడతాడా!

    ఒకానొప్పుడు ఓ ఇరవయ్యేళ్ల కుర్రాడికి బ్యాటిచ్చి ఆడుకోమంటే…. కంగారూల కంచుకోట గబ్బా గోడలను బద్దలు కొట్టాడట. క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లండ్ లో ఆ దేశ జట్టునే జుట్టు పట్టుకునేలా చేశాడంట. అతడు గ్రౌండులో అడుగు పెడితే రెండు జరుగుతాయట. ఒకటి మన టీం భయపడటం. రెండోది అవతలి టీం అంతకు మించి వణకడం, ఇదీ తోటి ఆటగాడు అతడి గురించి చెప్పిన మాట. పక్కా టీ20 ప్లేయర్ అన్న బిరుదుతో టీమిండియాలో అడుగుపెట్టి… చరిత్రలో పదిలంగా తన పేరు లిఖించుకునేలా పక్కా టెస్టు … Read more

    బ్యాటర్ల హోరు.. బౌలర్ల బేజారు.. బౌలర్లకు గత్తర లేశినట్టుంది సూడలేక

    టీ20 క్రికెట్ అంటే సిక్సులు, ఫోర్ల హోరు.. బ్యాటర్ల జోరు.. బౌలర్ల బేజారు అచ్చంగా ఇదే జరిగింది ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ టీ20 సిరీస్‌లో. నార్తాంప్టన్‌షైర్, వార్విక్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఏకంగా 424 పరుగులు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు బ్యాటర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ చేధనకు దిగిన జట్టు 7 బంతులు మిగిలుండగానే 212 పరుగులు చేసింది. ఒక దశలో 50లోపే మూడు ప్రధాన వికెట్లను … Read more

    తెలుగు ఘనకీర్తి, బాక్సింగ్ రింగ్ సివంగి నిఖత్ జరీన్ బర్త్ డే నేడే

    బాక్సింగ్ ప్రపంచంలో భారత్ సత్తా చాటి తెలుగువారికి గర్వకారణంగా నిలిచిన ‘నిఖత్ జరీన్’ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా యూసే నిఖత్‌కు శుభాకాంక్షలు చెబుతోంది. 1996లో తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించిన నిఖత్ జరీన్ చిన్నప్పటి నుంచే ఆటలపై మక్కువ పెంచుకుంది. మొదట్లో ‘ఆడపిల్లవు బాక్సింగ్ చేస్తావా? మగాళ్లలా ఆటలాడతావా?’ అంటూ చాలా హేళన చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా తండ్రి ప్రోత్సాహంతో ధైర్యంగా అడుగేసి నేడు ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. బాక్సింగ్ ప్రయాణంలో తొలి అడుగులు చిన్నప్పుడు నిఖత్ రోజూ ఉదయాన్నే … Read more

    ‘హార్దిక్ పాండ్యా’ కేవలం ఆటగాడు కాదు!

    గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే జట్టుకు కప్పు అందించిన హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. అతడి ఆటపైనే విమర్శలు వస్తున్న వేళ కెప్టెన్ గా కూడా రాణించి వేల నోళ్లు మూయించాడు.లీగ్ దశ నుంచి కప్పు కొట్టే వరకూ జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. హార్దిక్ కేవలం ఆటగాడు కాదు గొప్ప నాయకుడంటూ సీనియర్ క్రికెటర్లు కొనియాడుతున్నారు. టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ గానూ ఎదగగలడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Screengrab Twitter: Screengrab Twitter: Screengrab … Read more