• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పల్సర్ బైక్ సాంగ్; దుమ్మురేపిన శ్రీలీల

  ‘ధమాకా’ మూవీలోని ‘పల్సర్ బైక్’ ఫుల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ శ్రీలీల ఎనర్జీ అదరహో అనిపిస్తోంది. తన అందం, అభినయంతో దుమ్మురేపింది. గాజువాక కండక్టర్ ఝాన్సీకి ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్ వేసి ఆకట్టుకుంది.

  రామాయణం అలా.. మహాభారతం ఇలా..!

  మనం ఎలా బతకాలో రామాయణం సూచిస్తుందని.. ప్రస్తుతం ఎలా నడుచుకుంటున్నామో మహాభారతం చెబుతోందని బాలకృష్ణ వెల్లడించారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్‌తో మెలిగిన తీరును వివరించారు. ఈ కార్యక్రమానికి వీరసింహారెడ్డి చిత్రబృందంతో పాటు, డైరెక్టర్లు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, శివనిర్వాణ, యువ నటులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్; పేలుతున్న జోకులు

  ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. కాగా ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ [డ్యాన్స్](url) చేసింది. ‘వహ్ వహ్ రామ్‌జీ’ పాటకు వారు కాలు కదిపారు. వారి డ్యాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.‘ముఖేష్ అంబానీ రిహార్సల్స్ చేయడం మర్చిపోయినట్లు ఉన్నాడు’ అని, ‘కరణ్ జోహార్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రఫీ’ అంటూ జోకులు పేలుస్తున్నారు. #WATCH | The Ambani … Read more

  ఏం కాన్ఫిడెన్స్‌ రా బుడ్డోడా?

  చిన్న పిల్లలకు కాస్త ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది. అందులో కొంతమంది ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఇలాంటి బాలుడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో అతడు నేపాలి భాషలో ఫుల్ జోష్‌తో పాట పాడుతున్నాడు. తోటి విద్యార్థులు అతడిని చూసి ఆశ్చరపోయారు. ఈ వీడియోను షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి టెంజేన్ ఇమ్నా… జీవితంలో ఇంత కాన్ఫిడెన్స్‌ ఉంటే చాలని క్యాప్షన్ ఇచ్చాడు. Bas itna confidence chahiye life me. ? "ज़िन्दगी जीने के … Read more

  పాపం… మృగరాజు

  సాధారణంగా వేటాడే సింహాలను చూసి భయపడతాం. కానీ, ఈ సింహం చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంది. వాటికున్న శరీరాకృతి కారణంగా చెట్లు ఎక్కడంలో అవి కొద్దిగా ఇబ్బంది పడతాయి. అడవికి రారాజుగా పిలుచుకునే సింహం చెట్టు నుంచి కిందపడితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. https://www.instagram.com/p/CnK0XGDBpih/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Instagram:Waow Africa Screengrab Instagram:Waow Africa

  80 ఏళ్ల వయసులో మారథాన్

  వయసు సంకల్పానికి అడ్డు కాదని ఓ బామ్మ నిరూపించింది. 80 ఏళ్ల వయసులో యువతతో పోటీ పడుతూ మారథాన్‌ పాల్గొంది. 18వ ఎడిషన్ ముంబై మారథాన్ కార్యక్రమంలో జాతీయ జెండా పట్టుకొని హుషారుగా పరిగెత్తారు. ఆమెను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆమె మనువరాలు పోస్ట్ చేసింది. https://www.instagram.com/p/CnhhxHtje_M/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Twitter:Dimple Mehta Fernandes Screengrab Twitter:Dimple Mehta Fernandes

  నాటు నాటుకు NTR, ANR స్టెప్పులు

  గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ స్టెప్పులకు ఎంత క్రేజ్‌ వచ్చిందో తెలుసిందే. మరి ఈ పాటకు ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ [వీడియో](url)లో చూడండి. #NaatuNaatu పాటకి చిందేసిన ఎన్టీవోడూ, ఏఎన్నారూ! ? (Whatsapp forward) pic.twitter.com/CmP6cPuUZ4 — వాక్కేళి (@ivak99) January 19, 2023

  వైజాగ్‌లో అల్లు అర్జున్‌ మేనియా

  [VIDEO](url):ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నుంచి భారీ అంచనాలతో రాబోతున్న పుష్ప: ది రూల్‌ తర్వాతి షెడ్యూల్‌ వైజాగ్‌లో జరగనుంది. ఇందుకోసం అల్లు అర్జున్ వైజాగ్‌ బయల్దేరారు. వైజాగ్‌లో ఇప్పటికే అల్లు మేనియా కనిపిస్తోంది. అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు ఆయన ఫ్యాన్స్‌ కాచుకుని కూర్చుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప.. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఇప్పుడు పుష్ప-2 కోసం టాలివుడ్‌లోనే గాక బాలివుడ్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. Anakapalle AlluArjun Army Ready To Welcome Our … Read more

  ‘భోళా శంకర్‌’ సెట్‌కు చిరుకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

  [VIDEO](url): ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌ హిట్ జోరులో ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి.. అదే ఉత్సాహంతో ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ మొదలుపెట్టారు. తమిళ సినిమా వేదాలం రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. షూటింగ్‌ స్పాట్‌లో చిరుకు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తోంది. కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా..మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. A MASSive … Read more

  బోనులో ఉంది కదా అని చెయ్యి పెడితే వేలు పోయే!

  క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలి. జూలో ఉన్న జంతువులను దూరం నుంచి చూసి అలా ఫొటో దిగితే తప్పు లేదు. కానీ, ఏమవుతుందిలే అని అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదు. ఓ వ్యక్తి సింహం బోనులో చేతి పెట్టి జూలను ముట్టుకోవటానికి ప్రయత్నించాడు. ఇంతలో అది వేలును నోటితో పట్టుకుంది. ఎంతగా ప్రయత్నించినా విడువలేదు. వేలును లాగేసింది. కొద్దిరోజులుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Earth Reels … Read more