తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్ ఒకరు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం.
శ్రియా శరణ్ 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్ చేశారు.
2001లో వచ్చిన ‘ఇష్టం‘ సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది.
తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఆ తర్వాత ‘నేనున్నాను‘, ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.
రామ్‌చరణ్, తారక్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్ రోల్‌లో నటించింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.
గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్ స్కూల్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్‌గా ‘షోటైమ్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్ పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. ‘Suriya 44’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్ వీడియోలలోనూ శ్రియా శరణ్ మెరిసింది. ‘తిరకటి క్యూన్ హవా’, ‘కహిన్ దూర్’, ‘రంగ్ దే చునారియా’, ‘బరి బరి సాంగ్’ ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.
ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?