• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!

  భారత్‌లో సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ మరే దేశంలో ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడి ఆడియన్స్‌ సినీ తారలను ఎంతగానో అభిమానిస్తారు. తమ ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ సినిమా వస్తుందంటే ఓ పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తమ తారల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు సెర్చ్‌ చేస్తుంటారు. ఇలా పదేళ్ల కాలంలో అత్యధికసార్లు సెర్చ్‌ చేసిన టాప్‌ 100 సెలబ్రిటీలను IMDB ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం చోటు దక్కించుకున్నారు. మరి టాప్‌ 20లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు? టాలీవుడ్‌ స్టార్స్‌కు ఏ ర్యాంకులు దక్కాయి? ఇప్పుడు చూద్దాం. 

  టాప్‌-20లో బాలీవుడ్‌ తారలు

  సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచిన సంస్థగా ఐఏండీబీ (IMDB)కి పేరుంది. అటువంటి సంస్థ గత పదేళ్లలో తమ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేయబడ్డ టాప్‌ -100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె (Deepika Padukone) అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో నిలిచారు. గత పదేళ్ల కాలంలో ఈ తారల గురించే ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు IMDB ప్రకటించింది. ఇక ఈ జాబితాలో టాప్-20లో ఏ తెలుగు స్టార్‌ హీరోకూ చోటు దక్కక పోవడం గమనార్హం. అయితే సౌత్‌ నుంచి హీరోయిన్లు సమంత (13), తమన్నా (16), నయనతార (18) టాప్‌- 20లో చోటు దక్కించుకున్నారు. 

  1. దీపిక పదుకొనే (Deepika Padukone)
  2. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)
  3. ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan)
  4. అలియా భట్‌ (Alia Bhatt)
  5. ఇర్ఫాన్‌ ఖాన్‌ (Irrfan Khan)
  6. అమీర్‌ ఖాన్‌ (Aamir Khan)
  7. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput)
  8. సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)
  9. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)
  10.  అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)
  11. కత్రినా కైఫ్‌ (Katrina Kaif)
  12. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)
  13. సమంత రూత్‌ ప్రభు (Samantha Ruth Prabhu)
  14. కరీనా కపూర్‌ (Kareena Kapoor)
  15. త్రిప్తి దిమ్రి (Tripti Dimri)
  16. తమన్న భాటియా (Tamannaah Bhatia)
  17. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)
  18. నయనతార (Nayanthara)
  19. రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh)
  20. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn)

  తెలుగులో టాప్‌ ఎవరంటే?

  ఐఎండీబీ విడుదల చేసిన టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ టాప్‌లో నిలిచాడు. ఈ జాబితాలో ఆయన 29వ స్థానంలో నిలిచాడు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ గురించి దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు ఐఎండీబీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ జాబితాలో ప్రభాస్‌ తర్వాత తెలుగు నుంచి రామ్‌ చరణ్‌ (31), అల్లు అర్జున్‌ (47), జూనియర్ ఎన్టీఆర్‌ (67), మహేశ్‌ బాబు (72) చోటు దక్కించుకున్నారు. అటు తమిళం నుంచి పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ధనుష్ (30), విజయ్ (35), రజనీకాంత్ (42), విజయ్ సేతుపతి (43), మాధవన్ (50), కమల్ హాసన్ (54), సూర్య (62), విక్రమ్ (92), అజిత్ (98) టాప్‌-100లో నిలిచారు. 

  టాలీవుడ్‌కు అన్యాయం జరిగిందా?

  ఐఎండీబీ రిలీజ్‌ చేసిన తాజా జాబితాలో టాప్‌-20లో కనీసం ఒక్క తెలుగు హీరో చోటు దక్కించుకోకపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ జాబితాను ఏకపక్షంగా ఐఎండీబీ రూపొందినట్లు విమర్శిస్తున్నారు. ప్రభాస్‌ (సలార్‌), అల్లు అర్జున్‌ (పుష్ప), రామ్‌చరణ్‌ – తారక్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) తమ చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఐఎండీబీ జాబితాలో తెలుగు స్టార్స్ వెనకబడి పోవడానికి ఓ కారణముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐఎండీబీ తాజా జాబితాను తన సైట్‌లో ఎక్కువగా సెర్చ్‌కు వచ్చిన తారలను ఆధారంగా చేసుకొని విడుదల చేసిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఐఎండీబీ సైట్‌ను సౌత్‌లో కంటే నార్త్‌ ఆడియన్స్‌ ఎక్కువగా వినియోగిస్తారని తెలిపాయి. గత పదేళ్ల కాలంలో వచ్చిన సెర్చ్‌ వివరాలను లెక్కగట్టి ఐఎండీబీ ఈ లిస్ట్‌ను క్రియేట్‌ చేసిందని టాలీవుడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందువల్లే బాలీవుడ్‌ స్టార్‌ ఈ జాబితాలో టాప్‌లో నిలిచారని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుంచి కూడా సైట్‌లోకి పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ వచ్చి ఉంటే మన వారు కూడా కచ్చితంగా టాప్‌-10లో నిలిచేవారని స్పష్టం చేస్తున్నారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv