పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిక్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్ చేయని కమల్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి
కమల్ ఏమన్నారంటే
దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్‌గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్.. కల్కిలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్.. ఈ చిత్రాన్ని హవర్ గ్లాస్‌తో పోల్చారు. మనం ఎలా టర్న్ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కల్కిలో భారీ కాస్టింగ్
ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్, కమల్ హాసన్‌లతో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రానాలు కూడా గెస్ట్ రోల్స్‌లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్ వాహనానికి హీరోయిన్ కీర్తి సురేష్ తన వాయిస్ అందించింది. ఇలా ఇంతమంది స్టార్ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.
అలనాటి నటి గ్రాండ్ ఎంట్రీ!
కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్ క్యాస్టింగ్‌లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
జూన్ రెండో వారంలో ట్రైలర్!
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటికే ‘బుజ్జి అండ్ భైరవ’ అనే యానిమేటెడ్ సిరీస్‌ను ఓటీటీలో లాంచ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్ కూడా మెుదలైనట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జూన్ రెండో వారంలో ట్రైలర్ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్ వండర్‌లా ట్రైలర్ ఉంటుందని, అసలు కంటెంట్‌ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి