• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప గ్లింప్స్‌, ప్రమోషన్‌ పోస్టర్లు, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రోజు కోసం.. సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చెప్పిన తేదీకే సినిమా రిలీజ్‌ చేస్తే కలెక్షన్స్‌లో భారీగా కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    పుష్ప 2 వాయిదా..!

    ప్రస్తుతం ‘పుష్ప 2’ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్‌ సైతం నిర్వహిస్తున్నారు. జూన్‌ ఎండింగ్‌ నాటికి షూటింగ్‌ ముగించాలని దర్శకుడు సుకుమార్‌ టార్గెట్‌ పెట్టుకోగా.. అది పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని టాక్‌ వినిపిస్తోంది. సినిమా షూట్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. అంటే జులై ఎండింగ్‌కి పుష్ప 2 షూట్‌ కంప్లీట్‌ కానుందట. కాబట్టి మిగిలిన 15 రోజుల్లో ప్రీ రిలీజ్‌ వర్క్‌ చేయడం అసాధ్యం కాబట్టి.. ‘పుష్ప 2’ పోస్ట్‌ పోన్‌ చేస్తే బెటర్‌ అని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్‌ తీవ్రంగా డిసప్పాయింట్‌ అవుతున్నారు. 

    సుకుమార్‌ అసంతృప్తి

    పుష్ప 2 చిత్రానికి ఎడిటర్‌గా కార్తిక్‌ శ్రీనివాస్‌ పనిచేశారు. కొద్ది నెలల పాటు యూనిట్‌తో కలిసి ట్రావెల్‌ చేసిన అతడు పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో నవీన్‌ నూలి వచ్చి ఫైనల్ కట్స్‌ చేశారు. అయితే ఆ ఫైనల్‌ ఔట్‌పుట్‌పై సుకుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా కొన్ని ఎపిసోడ్స్‌ను సుకుమార్‌ రీడిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆగస్టు 15 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమని మూవీ యూనిట్‌ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. 

    కలెక్షన్స్‌లో భారీ కోత!

    పాన్‌ ఇండియా స్థాయి సినిమా అంటే విడుదల తేదీ పక్కాగా ఉండాలి. అలా లేకుంటే దాని ప్రభావం కలెక్షన్స్‌పై కూడా పడుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15నే రిలీజ్‌ చేస్తే.. కలెక్షన్ల పరంగా బన్నీకి భారీ షాక్‌ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే రోజున తమ చిత్రాలు రిలీజ్‌ చేసేందుకు ముగ్గురు బడా హీరోలు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) నటిస్తున్న ‘తంగలాన్’ (Thagalaan) చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) కూడా తన ‘సింగం ఎగైన్‌’ (Singham Again) చిత్రాన్ని ఆ రోజునే తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే స్టార్‌ నటుడు జాన్‌ అబ్రహం (John Abraham) నటించిన ‘వేద’ (Veeda) ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఆ మూడు భారీ చిత్రాలు బరిలో ఉండగా వాటిని తట్టుకొని ‘పుష్ప 2’ పాన్‌ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్‌ రాబట్టగలదా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం చిత్రాల రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో నార్త్‌లో ‘పుష్ప 2’ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడొచ్చని అంటున్నారు. 

    పవన్‌ అభిమానుల్లో ఆగ్రహం

    ప్రస్తుతం అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైకాపా అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీని బాయ్‌కాట్‌ చేస్తామని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బుధవారం (జూన్‌ 12) జరిగిన పవన్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం బన్నీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్‌ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని కష్టాల మధ్య ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్‌ చేయకపోవడమే మంచిదని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv