టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (తారక్ – రామ్‌చరణ్), వాల్తేరు వీరయ్య (చిరు – రవితేజ), ‘సలార్’ (ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్), కల్కి (ప్రభాస్, అమితాబ్, కమల్) చిత్రాలు ఏ స్థాయి సక్సెస్ సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మైండ్ బ్లోయింగ్ మల్టీ స్టారర్ తెలుగులో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దక్షిణాది స్టార్ హీరోలు రామ్‌చరణ్, సూర్యలు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్ – సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్‌తో సినిమా తర్వాతే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో డైరెక్టర్ హను రాఘవపూడి ఓ బిగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు కూడా ఇటీవలే ముగిసాయి. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ హను గత చిత్రాలకు భిన్నంగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఇది రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా తర్వాతనే రామ్‌చరణ్-సూర్య కాంబో మూవీపై హను రాఘవపూడి దృష్టి పెడతారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
చరణ్-సూర్య బిజీ బిజీ
ప్రస్తుతం రామ్ చరణ్, సూర్య ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తుండగా సూర్య ‘కంగువ’ (Kanguva) చేస్తున్నాడు. సూర్య చిత్రం అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అటు రామ్‌చరణ్ డిసెంబర్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేసే ఛాన్స్ ఉంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్‌చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ను లాక్ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మెగా మల్టీస్టారర్ లోడింగ్..!
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్ శంకర్ తన ‘మిస్టర్ బచ్చన్‘ సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్ కోసం మెగాస్టార్ ఓ స్పెషల్ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ సైతం ‘శంకర్ దాదా MBBS’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!