పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ గత చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్’ (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ బయటకొచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి స్పెషల్!
‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ రోల్‌లో కనిపించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్‌తో సంప్రదింపులు సైతం జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు చిరు సానుకూలంగా స్పందిస్తే స్పిరిట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చెప్పవచ్చు. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం స్పిరిట్‌లో మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథకు ఆ పాత్ర కూడా ఎంతో కీలకం కానుందని అంటున్నారు. వీటిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే కొరియన్, చైనీస్ స్టార్స్ కూడా ఇందులో నటిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి.
షూటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అవి తుది దశకు చేరుకోవడంతో నవంబర్ నుంచి షూటింగ్ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి వంగా తొలుత భావించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం అవి షూటింగ్ కూడా జరుపుకుంటున్నాయి. ప్రభాస్ ఆయా చిత్రాలకు డేట్స్ కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ వీక్‌లో స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సందీప్ రెడ్డి వంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటికీ రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పాటు ఫౌజీ 50% పైగా షూటింగ్ ఫినిష్ చేసుకుంటుంది. దీంతో ప్రభాస్ షూటింగ్స్ పరంగా కాస్త ఫ్రీ అవుతాడని సందీప్ భావిస్తున్నారట. అంతేకాదు ప్రభాస్ ఫోకస్ మెుత్తం స్పిరిట్ పైనే ఉండేలా సందీప్ వంగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా జనవరి ఫస్ట్ వీక్‌లో స్పిరిట్ పూజ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారట. సంక్రాంతి తర్వాత నుంచి ప్రభాస్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారని లేటెస్ట్‌గా అప్‌డేట్ అందుతోంది.
బడ్టెట్ తెలిస్తే షాకే!
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా ‘స్పిరిట్’ నిలవనుంది.
ప్రభాస్‌కు రికార్డు రెమ్యూనరేషన్!
‘స్పిరిట్’కు కేటాయించనున్న బడ్జెట్‌లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఎందుకంటే ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ పోషించనున్నాడు. కాబట్టి ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడం సమంజసమే అంటున్నారు. ఇదే నిజమైతే రూ.300 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్న ఏకైక భారతీయ నటుడిగా ప్రభాస్ నిలవనున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్ (Anil Kapoor), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), కరీనా కపుర్ (Kareena Kapoor) ఇందులో స్పెషల్ రోల్స్ చేస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో పారితోషికానికి ఆ మాత్రం బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు