• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుష్ప 2 నుంచి వీడియో విడుదల

    పుష్ప 2 చిత్రం నుంచి వీడియో విడుదలయ్యింది. జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడున్నాడో తెలుసుకోండి అంటూ మేకర్స్‌ వీడియోను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కానుకగా అందించారు.

    సోషల్‌మీడియాలో అల్లుఅర్జున్ ఎమోషనల్ పోస్ట్

    సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఓ [నోట్](url) రాశారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రేక్షకులు చూపించిన ఆదరాభిమానాలేనని స్పష్టం చేశాడు. ‘సినీ రంగంలో ఈరోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. మీ ప్రేమను పొందుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈరోజు ఇక్క‌డ ఉన్నానంటే కార‌ణం ప్రేక్ష‌కులు, అభిమానులు. న‌న్నెంత‌గానో ఇష్ట‌ప‌డేవారు చూపించిన ప్రేమ‌. మీకెప్ప‌టికీ రుణపడి ఉంటాను’ అని బన్నీ తెలిపాడు. బన్నీ తొలి సినిమా గంగోత్రి మార్చి … Read more

    రెమ్యూనరేషన్‌లో ప్రభాస్‌ను దాటేసిన అల్లు అర్జున్‌!

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రెమ్యూనరేషన్‌ విషయంలో వెనక్కి నెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో చేస్తున్న చిత్రానికి బన్నీ ఏకంగా రూ.125 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో రూ.100 కోట్లుగా ఉన్న ప్రభాస్‌ మార్కెట్‌ను అల్లు అర్జున్ దాటేశారని ప్రచారం జరుగుతోంది. తద్వారా టాలీవుడ్‌ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా బన్నీ నిలిచాడని చెప్పుకుంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, సందీప్‌ వంగా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. పుష్ప … Read more

    ఆస్ట్రేలియా ఫ్యాన్ పుష్ప మ్యానరిజం

    [VIDEO](url): పుష్పలో అల్లు అర్జున్ మ్యానరిజం ‘తగ్గేదేలే’ డైలాగ్ ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్‌కు పాకింది. తాజాగా జరిగిన BGT-2023 సిరీస్ చూసేందుకు వచ్చిన ఆసీస్ అభిమాని తగ్గేదేలే అంటూ డైలాగ్ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Australia fan with a 'Pushpa' trademark and dialogue after the win in Indore. pic.twitter.com/zaausE4wWB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 3, 2023

    పుష్ప 2 నుంచి త్వరలోనే గ్లింప్స్‌

    పుష్ప 2కి సంబంధించి ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. త్వరలోనే చిత్రం నుంచి గ్లింప్స్‌ విడుదల అవుతుందని చెప్పారు. దానికోసం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. “ఓ టెక్నిషియన్‌గా నాకు తెలిసినప్పటికీ గ్లింప్స్‌ గురించి నేను కూడా ఎదురుచూస్తున్నాను. అది చూశాక మీకు అర్థమవుతుంది సినిమా ఎలా ఉంటుందో “ అన్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 8న విడుదల చేస్తారని తెలుస్తోంది. VOLCANIC ERUPTION Soon!!!??@alluarjun ? #PushpaTheRule pic.twitter.com/rLARTOZPFd — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) … Read more

    వైజాగ్‌లో ఫ్యాన్ మీట్.. హాజరైన ఐకాన్ స్టార్

    విశాఖపట్నంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశాడు. వైజాగ్ ఫ్యాన్‌మీట్‌లో పాల్గొని అభిమానులకు అభివాదం చేశాడు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలిరావడంతో కాస్త రసాభాస చోటు చేసుకుంది. దీంతో అర్ధంతరంగా ఫొటో షూట్‌ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఫొటో షూట్ రద్దు కావడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చామని, చివరికి ఇలా జరగడంతో [కన్నీళ్లు](url) పెట్టుకున్నారు. అంతకుముందు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ స్వాగతం పలికారు. *Bunny Annaya Arrived at Photoshoot … Read more

    వైజాగ్‌లో అల్లు అర్జున్‌ మేనియా

    [VIDEO](url):ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నుంచి భారీ అంచనాలతో రాబోతున్న పుష్ప: ది రూల్‌ తర్వాతి షెడ్యూల్‌ వైజాగ్‌లో జరగనుంది. ఇందుకోసం అల్లు అర్జున్ వైజాగ్‌ బయల్దేరారు. వైజాగ్‌లో ఇప్పటికే అల్లు మేనియా కనిపిస్తోంది. అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు ఆయన ఫ్యాన్స్‌ కాచుకుని కూర్చుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప.. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఇప్పుడు పుష్ప-2 కోసం టాలివుడ్‌లోనే గాక బాలివుడ్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. Anakapalle AlluArjun Army Ready To Welcome Our … Read more

    రష్యన్ భాషలో పుష్ప ట్రైలర్

    బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని రష్యన్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 8న విడుదలకు ముహుర్తం ఖరారయ్యింది. కేవలం వారం మాత్రమే సమయం ఉండటంతో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేయకుండా…మన దగ్గర రిలీజ్ చేసిన దానికి రష్యన్ లో డబ్బింగ్ చెప్పారు. భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్ అన్నిచోట్లకు పాకింది.

    నా తమ్ముడు హిట్ కొట్టడం సంతోషంగా ఉంది: అల్లు అర్జున్‌

    పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌ తన తమ్ముడి పట్ల ఎమోషనల్‌ అయ్యాడు. ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్‌ మీట్‌లో మాట్లాడిన అల్లు అర్జున్‌..తన తమ్ముడిని అంతరూ పొగడుతుంటే సంతోషంగా ఉందన్నాడు. తాను హిట్‌ కొట్టినా ఇంత ఆనంద పడనని కానీ తన తమ్ముడిని అందరూ మెచ్చుకోవడం బాగుందన్నాడు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేష్‌ శశి దర్శకత్వంలో ‘ఊర్వశివో రాక్షసివో’ తెరకెక్కింది. ఈ నెల 4న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

    బుడ్డోడి పర్ఫార్మెన్స్‌కి బన్నీ ఫిదా

    ‘ఊర్వశివో రాక్షసివో’ విజయోత్సవ వేడుకలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ఈ వేడుక జరుగుతోంది. అయితే, ఈ వేడుకలో తన పర్ఫార్మెన్స్‌తో ఓ బాలుడు అందరినీ మెస్మరైజ్ చేశాడు. డయాస్‌పై డ్రమ్స్ వాయిస్తూ చెర్రీ స్వరూప్ అలరించాడు. దీంతో ఈ బుడ్డోడి ప్రదర్శనకు అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. చప్పట్లు కొడుతూ బాలుడిని ఎంకరేజ్ చేశాడు. తన ప్రదర్శన ముగిసిన అనంతరం చెర్రీ ‘తగ్గేదెలే’ అంటూ డైలాగ్ చెప్పడంతో ఈ [వీడియో](url) చక్కర్లు కొడుతోంది. … Read more