• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రేమించలేదని చంపబోయాడు

  ప్రేమించలేదని కక్ష్య గట్టి యువతిని చంపేందుకు ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన పూణేలో జరిగింది. లక్ష్మణ్ జాదవ్‌ గత కొంత కాలంగా ప్రీతిని ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు అతడి తండ్రికి కూడా ఫిర్యాదు చేశారు, అయినప్పటికీ అతను వేధించడం ఆపలేదు. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ రోజు ప్రీతిని చంపేందుకు కొడవలితో నడిరోడ్డుపై వెంబడించి నరకబోయాడు. ఆమె ఎలాగో స్థానికుల సహాయంతో ప్రమాదం నుంచి బటయపడింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ … Read more

  రూపాయికే బిర్యానీ: ఎగబడ్డ జనం.. ట్విస్ట్ ఏంటంటే?

  కరీంనగర్‌లో ఓ హోటల్ ఓపెనింగ్ సందర్భంగా యజమాని రూపాయికే చికెన్ బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. ఇంకేముంది బిర్యానీ కోసం జనాలు ఎగబడ్డారు. యజమాని 800 బిర్యానీలు కస్టమర్లకు పంచాడు. అయినా జనం రద్దీ తగ్గలేదు. బిర్యానీ ప్యాకెట్లు అందనివారు హోటల్‌పై దాడికి దిగారు. దీంతో ఆ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి రోడ్డు పక్కన బైక్‌లన్నింటికీ రూ.200 చొప్పున ఫైన్ విధించారు. దీంతో జనాలు లబోదిబోమంటూ ఇంటిబాట పట్టారు. 1 రూపాయి చికెన్ బిర్యానీ కోసం ఎగబడి హోటల్ … Read more

  డింపుల్ ఇంట్లోకి చొరబడిన అగంతకులు

  హీరోయిన్ డింపుల్ హయాతీ ఇంట్లోకి ఓ యువతీ, యువకుడు చొరబడడం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో తన బాయ్‌ఫ్రెండ్ విక్టర్ డేవిడ్‌తో డింపుల్ నివసిస్తోంది. ఈ క్రమంలో డింపుల్ నివసించే ఫ్లాట్‌లోకి రాజమండ్రికి చెందిన కొప్పిశెట్టి సాయిబాబు, శృతిలు ప్రవేశించారు. పనిమనిషి ఎవరా అని ఆరాతీయగా వారు పారిపోయారు. వెంటనే డింపుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతీ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  బాబు బాగా టాలెంటెడ్.. నెటిజెన్లు ఫిదా!

  ఓ కుర్రాడు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వినూత్న ట్రిక్ ప్లే చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఓ కుర్రాడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. వారిని చూడగానే స్కూటీ దిగి తోసుకుంటూ ముందుకెళ్లిపోయాడు. పోలీసులు కూడా అతడిని పట్టించుకోలేదు. పోలీసులను దాటగానే ఆ కుర్రాడు స్కూటీ స్టార్ట్ చేసి తుర్రున జారుకున్నాడు. దీనంతటిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. https://www.instagram.com/reel/CrQgfMRpwKt/?utm_source=ig_web_copy_link

  వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన నటి!

  వ్యభిచారం నడుపుతోందనే ఆరోపణలపై నటి, క్యాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఓషివారాలో ఉన్న ఆరాధన అపార్ట్‌మెంట్లో ఆమె వ్యభిచారం నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. రెయిడ్ చేసి ఇద్దరు మోడల్స్‌ను రక్షించారు. ఆర్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఆర్తి సినిమా ఛాన్స్‌ల పేరుతో మోడళ్లను కలసి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతోంది. ఆర్తికి ఇన్‌స్టాలో లక్ష మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఈ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు పక్కా … Read more

  ఖైదీతో షాపింగ్ చేయించిన పోలీసులు!

  జైలుకు తీసుకెళ్లాల్సిన ఖైదీని పోలీసులు షాపింగ్ తీసుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. రిషభ్ రాయ్ అక్రమ ఆయుధాల కేసులో 6 నెలలుగా జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స అనంతరం ఖైదీని నేరుగా జైలుకు తీసుకురాకుండా షాపింగ్‌మాల్‌కు తీసుకెళ్లారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఓ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా [వైరల్‌](url)గా మారింది. #लखनऊ मेडिकल पर आए #बंदी को … Read more

  మందుబాబులకు వింత శిక్ష; 1000 సార్లు ఇంపోజిషన్

  కేరళలో మందుబాబులకు పోలీసులు[ వింత శిక్ష](url) విధించారు. హెచ్చరికలు, జరిమానాలు విధించి, విసిగిపోయిన పోలీసులు వినూత్న శిక్ష వేశారు. కొచ్చిలోని త్రిపునితర పోలీస్ స్టేషన్‌ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారితో ‘ఇకపై నేను మద్యం తాగి వాహనం నడపను’ అంటూ వారితో 1000 సార్లు ఇంపోజిషన్ రాయించారు. అన్ని సార్లు రాయలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. Kochi police today made drivers who were … Read more

  మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కైన పోలీసులు

  ఇద్దరు పోలీసులు యూనిఫాంలో ఉండి [మద్యం](url) సేవిస్తూ దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు.. ఓ చోట కూర్చుని మద్యం సేవిస్తున్నారు. పోలీసు వాహనాన్ని అడ్డు పెట్టుకుని మరీ మద్యం తాగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉన్నతాధికారులకు చేరడంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు. కాగా పోలీసుల తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విధుల్లో ఉండగానే మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కిన పోలీసులు Full Video Here >> https://t.co/c94TncnCwi#NTVTelugu #NTVNews #Police … Read more

  స్నేహితులే.. హంతకులు; జియాగూడ మర్డర్ కేసు

  జియాగూడ మర్డర్ కేసులో స్నేహితులే హంతకులని పోలీసులు నిర్ధారించారు. అక్షయ్, సోనూ, టిల్లూ అనే ముగ్గురు యువకులు జంగం సాయినాథ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కోఠికి చెందిన సాయినాథ్‌ను ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై [హత్య](url) చేసిన సంగతి తెలిసిందే. వేట కొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపి మూసీ నదిలో దూకి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. Murder in broad daylight on main road tarnishes … Read more

  మహిళతో కలసి చిందులేసిన ఎస్ఐ; వీడియో వైరల్

  తాను యూనిఫామ్‌లో ఉన్నాననే విషయాన్ని మరచి ఓ ఎస్ఐ మహిళతో చిందులేశాడు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డాడు. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని నారాయణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ తన బంధువుల ఇంట్లో నిశ్చితార్ధానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళతో కలసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. Video Of Delhi Cop's Dance In Uniform Goes Viral, He May Face … Read more