వాల్మీకి రచించిన ఇతిహాసగాథ రామాయణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్నాయి. ఈ కోవలోనే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సైతం తెరకెక్కింది. రామాయణం గొప్పతనాన్ని ఈ తరం వారికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సినిమాను తీశారు. అయితే రామాయణంలోని పాత్రలు లేకుండా కథను మాత్రమే ప్రతిబింబిస్తూ కమర్షియల్ హంగులతో రూపొందిన చిత్రాలు కూడా తెలుగులో వచ్చాయి. వాటిని పరిశీలనగా చూస్తే తప్ప ఆ విషయం అర్థం కాదు. అటువంటి చిత్రాలను YouSay మీ ముందుకు తెచ్చింది. ఆయా చిత్రాల్లోని రామాయణం తాలుకూ మూలాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
దసరా (Dasara)
హీరో నాని రీసెంట్ చిత్రం ‘దసరా’లోనూ రామాయణం కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు రావణుడి ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్‌పై కన్నేసిన విలన్.. ఆమెను సొంతం చేసుకోవడానికి కుట్రలు చేస్తుంటాడు. చివరికి హీరో అతడ్ని చంపి తన భార్యకు, ఊరికి ప్రశాంతత కల్పిస్తాడు.
ఆర్ఆర్ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ తారక్ (Jr NTR) పాత్రను గమనిస్తే ఆంజనేయుడు గుర్తుకు రాక మానడు. తన గూడెం నుంచి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన పాప ఆచూకి కోసం తారక్ హస్తినకు వెళ్తాడు. రావణకోట లాంటి బ్రిటిష్ బంగ్లాలోకి వెళ్లి బందింపబడిన బాలికలో ధైర్యం నింపుతాడు. చివరికి పాపను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. రాముడి వద్దకు సీతను ఆంజనేయుడు ఎలా చేర్చాడో అచ్చం అలాగే.
వర్షం (Varsham)
ప్రభాస్ – త్రిష (Trisha) జంటగా నటించిన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా గాఢంగా ప్రేమించుకోగా వీరి మధ్యలోకి విలన్ (గోపీచంద్) ఎంట్రీ ఇస్తాడు. త్రిషను ఇష్టపడి ఆమెను దక్కించుకోవాలని అనుకుంటాడు. అతడ్ని అంతం చేసి చివరికి ప్రభాస్ (Prabhas) తన ప్రేమను గెలిపించుకుంటాడు. ఈ కథను పరిశీలిస్తే రామాయణంలో సీతపై మనసు పడ్డ రావణుడు.. అతడ్ని సంహరించిన రాముడు గుర్తుకు వస్తారు.
వరుడు (Varudu)
2010లో వచ్చిన ఈ చిత్రానికి గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ (Allu Arjun), భానుశ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) జంటగా నటించగా.. ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆర్య (Actor Arya) చేశాడు. కథలోకి వెళ్తే హీరో హీరోయిన్లకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి పీటలపై నుంచి కథానాయకిని విలన్ ఎత్తుకెళ్తాడు. విలన్‌ను కనిపెట్టి అంతం చేయడం ద్వారా హీరో తన భార్యను పొందుతాడు. ఈ మూవీ స్టోరీ కూడా రామాయణాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒక్కడు (Okkadu)
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), భూమిక (Bhumika) జంటగా నటించిన బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘ఒక్కడు’. ఇందులో హీరోయిన్‌పై మనసు పడ్డ విలన్ (ప్రకాష్‌రాజ్) ఆమె కుటుంబాన్ని చంపి మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. భూమిక అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హీరో కంట పడుతుంది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు. విలన్‌ను అంతం చేసి హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
రావణన్ (Raavanan)
విక్రమ్, ఐశ్వర్యరాయ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘రావణన్’ చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. ఇందులో రాముడు లాంటి ఎస్పీ దేవ్ (పృథ్వీ) భార్య ఐశ్వర్యరాయ్‌ను నల్లమల్ల అడవులకు విక్రమ్ తీసుకొస్తాడు. సీతలాంటి ఆమెను వెత్తుక్కుంటూ పోలీసు ఆఫీసర్ పృథ్వీ, ఆంజనేయుడి పాత్ర లాంటి అడవులు తెలిసిన కానిస్టేబుల్ కార్తిక్ వెళ్తారు. రామాయణాన్ని ఆధునీకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ ఈ చిత్రం వచ్చింది.
సైనికుడు (Sainikudu)
మహేష్ – త్రిష జంటగా చేసిన ‘సైనికుడు’ సినిమా కథ రామాయణానికి కాస్త ఆపోజిట్‌గా ఉంటుంది. విలన్ మంచోడని భావించిన హీరోయిన్ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఓ కారణం చేత హీరోయిన్‌ను హీరో ఎత్తుకెళ్తాడు. విలన్ నిజస్వరూపం తెలుసుకున్నాక త్రిష.. మహేష్‌బాబుని ప్రేమిస్తుంది. త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని విలన్ ప్రయత్నించడంతో హీరో అతడ్ని చంపి ఆమెను సొంతం చేసుకుంటాడు.
రోబో (Robo)
రజనీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా డైరెక్టర్ శంకర్ రూపొందించిన చిత్రం ‘రోబో’. కథలోకి వెళితే సైంటిస్ట్ వశీకర్ చిట్టి అనే రోబోను తయారు చేస్తాడు. దానిలో మనుషులకు లాగే ఫీలింగ్స్ ఉండేలా చేస్తాడు. దీంతో ఆ రోబో హీరోయిన్‌పై మనసు పడుతుంది. ఆమెను ఎత్తుకెళ్లి పోతుంది. రక్షణగా తనలాగా ఉండే వందలాది రోబోలను సైన్యంగా చేసుకుంటుంది. చివరికీ హీరో ఆ రోబోను నిర్విర్యం చేసి ప్రేయసిని దక్కించుకుంటాడు.
ఆదిపురుష్ (Adipurush)
గతేడాది ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కూడా రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాపై దారుణమైన విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని ఈ కాలం పిల్లలకు తగినట్లుగా రూపొందించానని దర్శకుడు ఓంరౌత్ సమర్థించుకున్నాడు.
సీతారాముల కల్యాణం లంకలో
నితిన్ – హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం (Seeta Ramula Kalyanam Lankalo) టైటిల్‌కు తగ్గట్లే రామయాణ కథను గుర్తు చేస్తుంది. కాలేజీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ కుటుంబానికి విలన్‌కు మధ్య కుటుంబ కక్ష్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో విలన్ కథానాయికను రావణాసురుడిలా మాయ చేసి ఎత్తుకెళ్తాడు. అది గ్రహించిన హీరో లంక లాంటి అతడి ఇంటికి మారు వేషంలో వెళ్లి వారితో కలిసిపోతాడు. విలన్లను మాయ చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్