ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి కూడా. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్‘. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా ఓఠీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ రైడ్ కారణంగా సస్పెండ్ అవుతాడు. తర్వాత సొంతూరుకి వెళ్లి జిక్కీ (భాగ్య శ్రీ)ని ప్రేమిస్తాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి?’ అన్నది స్టోరీ.
ఆయ్ (Aay)
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘ఆయ్‘. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.14కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘కార్తీక్, సుబ్బు, హరి బాల్య స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకే కులం అని భావించి కార్తీక్‌ను కూడా పల్లవి ఇష్టపడుతుంది. అయితే నిజం తెలిసి అతడ్ని వదిలేసి ఇంకో పెళ్లికి రెడీ అవుతుంది. వారిద్దరిని కలిపేందుకు సుబ్బు, హరి ఎలాంటి పాట్లు పడ్డారు? చివరికీ వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ.
కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు‘ ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ వేదికగా ప్రసారం అవుతోంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ లీడ్ రోల్స్ చేశారు. రూ.5కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.17 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. ప్లాట్ ఏంటంటే ‘పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు ఉండటంతో సర్చంచ్ బుజ్జి (సాయి కుమార్)పై శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగుతాడు. గత జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఉత్సవం పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? స్నేహితులు తిరిగి కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ.
బాలుగాని టాకీస్ (Balu Gani Talkies)
బాలుగాని టాకీస్ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ఆహాలో అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్ నడుపుకునే యువకుడు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. బాలుగాని టాకీస్ మూవీలోని హీరో బాలకృష్ణ అభిమానిగా ఉంటారు.
తలవన్ (Thalavan)
మలయాళంలో వచ్చిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’. బిజు మీనన్, ఆసీఫ్ అలీ హీరోలుగా నటించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించింది. సెప్టెంబర్ 10 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఎస్‌ఐ కార్తిక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫర్‌పై సీఐ జయశంకర్ (బిజు మీనన్) స్టేషన్‌కు వస్తాడు. కార్తిక్‌ది దూకుడు మనస్తత్వం కావడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో ఓ రోజు జయశంకర్ ఇంటి మేడపై యువతి శవం దొరుకుతుంది. ఈ హత్య జయశంకర్ చేశాడని పోలీసులు అంతా నమ్ముతారు. ఇంతకీ రమ్యను ఎవరు చంపారు? ఈ నేరంలో జయశంకర్ ఎలా చిక్కుకున్నాడు? ఈ కేసును కార్తిక్ ఏ విధంగా సాల్వ్ చేశాడు? అన్నది స్టోరీ.
బెంచ్ లైఫ్ (Bench Life)
కమిటీ కుర్రోళ్లతో నిర్మాతగా మంచి విజయం సొంతం చేసుకున్న నిహారిక కొణిదెల బెంచ్ లైఫ్ పేరుతో కొత్త సిరీస్ నిర్మించింది. మానస శర్మ దర్శకత్వం వహిచించిన ఈ సిరీస్‌లో సెప్టెంబర్ 12 నుంచి సోనీ లైవ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సొంత కారణాలతో కంపెనీ బెంచ్‌పైకి రావాడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో మేనేజర్ ఈషా, కొత్త ఉద్యోగి ప్రసాద్‌తో వారికి సమస్యలు ఎదురవుతాయి. ముగ్గురు ఎందుకు బెంచ్‌లో కూర్చోవాలని అనుకుంటున్నారు? వారి వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో ఎలాంటి ఘటనలు జరిగాయి? అన్నది స్టోరీ.
డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)
గత వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పటికీ వాటిని చూడకుంటే ఈ వీకెండ్‌లో చూసేయండి. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదిగా సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇందులో రామ్‌కు జోడీగా కావ్యా థాపర్ నటించింది. ప్లాట్ ఏంటంటే ‘మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు?’ అనేది కథ
సింబా (Simbaa)
జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సింబా‘. ఈ సినిమాకు సంపత్ నంది కథ, మాటలు అందించాడు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 6 నుంచి ఆహా వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘పార్థ గ్రూప్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. దీని వెనక టీచర్ అక్షిక (అనసూయ), జర్నలిస్టు ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) ఉన్నట్లు నిర్ధారించి పోలీసులు అరెస్టు చేస్తారు. అయినప్పటికీ పార్థ గ్యాంగ్‌లోని మరో వ్యక్తి హత్యకు గురవుతాడు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? వీటితో మ్యాన్ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
నింద (Nindha)
యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్ర పోషించిన ‘నింద’ చిత్రం ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీకి రాజేశ్ జగన్నాథం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 6 నుంచి ఈటీవీ విన్ వేదికగా ప్రసారం అవుతోంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ‘ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. దీంతో తీర్పు చెప్పిన న్యాయమూర్తి బాధతో కన్నుమూస్తారు. ఈ కేసులో అసలైన నేరస్థుడిని పట్టుకునేందుకు జడ్డి కొడుకు బయలు దేరతాడు. ఆరుగురు అనుమానుతుల్ని కిడ్నాప్ చేసి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి సంచలన నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది కథ.
అడియోస్ అమిగో (Adios Amigo)
సూరజ్ వెంజరముడు, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అడియోస్ అమిగో‘. గత నెల ఆగస్టు 9న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ప్రియన్ (సూరజ్) ఆర్థిక సమస్యల్లో ఉంటాడు. తల్లి గుండె ఆపరేషన్‌కు సైతం డబ్బులేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి ధనవంతుడైన ప్రిన్స్ (ఆసిఫ్) పరిచయమవుతాడు. అయితే ఇతరులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ప్రిన్స్ వల్ల ప్రియన్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? ప్రిన్స్ వద్ద ప్రియన్ డబ్బు తీసుకోగలిగాడా? తన తల్లికి వైద్యం చేయించాడా?’ అనేది స్టోరీ.
రాబోవు చిత్రాలు
మారుతి నగర్ సుబ్రమణ్యం
విలక్షణ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam). ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సెప్టెంబర్ 20 నుంచి ఈ చిత్రం స్టీమింగ్‌లోకి రానుంది. ప్లాట్ ఏంటంటే ‘సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని సంకల్పించి మరో పని చేయకుండా సుబ్రమణ్యం ఖాళీగానే ఉంటాడు. భార్య సంపాదనపై జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. ఆ డబ్బు ఎవరిది? సుబ్రమణ్యంకు జాబ్ వచ్చిందా? లేదా? అతడి కొడుకు అంకిత్ లవ్ ట్రాక్ ఏంటి?’ అన్నది స్టోరీ.
తంగలాన్
తమిళ స్టార్ విక్రమ్ రీసెంట్ బ్లాక్‌బాస్టర్ చిత్రం తంగలాన్ కూడా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రసారం కానుంది. హిందీ వెర్షన్ మాత్రం 27 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇందిలా ఉంటే తంగలాన్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.105 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ‘తంగలాన్ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది