టీమిండియా క్రికెట్ ప్లేయర్ అజింక్య రహానె పుట్టినరోజు నేడు.(జూన్ 6) క్లాసిక్ ప్లేయర్‌గా రహానె సుపరిచితం. 1988లో మహారాష్ట్రలో జన్మించాడు.
గత కొన్నేళ్లుగా జాతీయ జట్టులో లేని రహానెకు అనూహ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే ఇందుకు కారణం.
అజింక్య రహానెకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ముంబయిలో ఉన్నప్పుడు తప్పకుండా వడాపావ్ తింటాడు. జపానీస్, చైనీస్ ఫుడ్‌కి ప్రాధాన్యమిస్తాడు.
క్రికెట్ కాకుండా రహానెకు టెన్నిస్ అంటే బాగా ఇష్టం. వీలు చిక్కినప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. రోజర్ ఫెదరర్ ఫేవరేట్ టెన్నిస్ ప్లేయర్.
కాస్త విరామం దొరికితే ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా, మహారాష్ట్రలోని ఎత్తైన ప్రదేశాలను చుట్టేందుకు ప్రయత్నిస్తాడు.
ఖాళీ సమయాల్లో గత కాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడీ ప్లేయర్. మునపటి ఫొటోలు, వీడియోలను చూస్తుంటాడు.
స్కూల్ లైఫ్‌లో క్లాసులో ఫస్ట్ ర్యాంక్ పొందినప్పుడు ఎంతో సాధించాననే భావన కలిగేదట. క్రికెట్ కోసం క్లాసులు బంక్ కొట్టడమూ మర్చిపోలేనని చెబుతుంటాడు.
రహానెకు క్రికెట్‌తో పాటు వ్యవసాయం అంటే కూడా ఎంతో ఇష్టం. పొలాల్లో క్రికెట్ ఆడటమంటే ఎగిరి గంతేస్తానని మురిసి పోతుంటాడు.
లార్డ్స్‌లో చేసిన సెంచరీ ఎప్పటికీ తన ఫేవరేట్ అని గుర్తు చేసుకుంటాడు. ఇంగ్లాండ్‌లో ఫేవరేట్ మైదానం కూడా ఇదేనట.
జట్టుతో ఉన్నప్పుడు రోహిత్ శర్మతో కలిసి చేసే విహార యాత్రను ఇష్టపడుతుంటాడట రహానె. సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రావిడ్ తన రోల్ మోడల్స్ అంటూ పదే పదే చెబుతుంటాడు.
క్రికెటర్ కాకపోయి ఉంటే ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ అయ్యుండేవాడట. లంబోర్గిని తన డ్రీమ్ కార్. ఫేవరేట్ మూవీ లగాన్.
రహానె తన చిన్ననాటి స్నేహితురాలు రాధికను 2104లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. 2016లో అర్జున అవార్డు స్వీకరించాడు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం