• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?

    అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్‌ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్‌ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

    Contents

    జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్‌

    జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్‌ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్‌ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం. 

    బాద్‌షా

    బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్‌ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ ‘డౌన్‌వార్డ్ ఫ్లిక్స్‌’ హేయిర్‌ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ యూత్‌ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..

    జనతా గ్యారేజ్

    ఈ సినిమాలో తారక్… ‘సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్‌ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు. 

    టెంపర్

    ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్… సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్‌(Spiked hairStyle)  స్టైల్‌తో కనిపించాడు.

    యమదొంగ

    యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్‌ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.

    నాన్నకు ప్రేమతో

    ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది.

    జై లవకుశ

    ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు.

    దేవర

    పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు.

    మహేష్ బాబు హేయిర్ స్టైల్స్‌

    బాబి

    తన కెరీర్ ప్రారంభంలో మహేష్‌ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు.

    పోకిరి

    పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్‌, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్‌ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను… అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు.

    సైనికుడు

    ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు.

    అతిథి

    అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు

    వన్ నేనొక్కడినే

    ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్‌ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

    SSMB29

    SSMB 29 నేపథ్యంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. 

    సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్

    డీజే టిల్లు& టిల్లు స్కేర్

    డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా.  ఈ హెయిర్‌ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని పిలుస్తారు.  టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు. 

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్

    భద్రినాథ్

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్‌ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది.  మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు.

    అల వైకుంఠపురములో

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్‌ బాటమ్‌లో వేవీ హెయిర్‌ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు.

    హ్యాపీ

    హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది.

    దువ్వాడ జగన్నాథం

    ఈ సినిమాలో “ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్” హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs)

    సరైనోడు

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ పేరు పొంపాడర్ హేయిర్ లుక్ 

    (Pompadour)

    బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్

    అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్‌ స్టైల్ బన్నీ ఫెవరెట్‌ అని తెలిసింది.

    రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్

    గోవిందుడు అందరివాడేలే

    ఈ చిత్రంలో రామ్‌ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్‌ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్‌ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు.

    గేమ్ ఛేంజర్

    లెటేస్ట్ గేమ్‌ ఛేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ గెల్డ్‌ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు.

    రామ్‌ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్

    రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్‌ పైరు “సైడ్ పార్టింగ్”. షూటింగ్ లేని సమయాల్లో రామ్‌ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు.

    మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్‌ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ‘మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్‌ స్టైల్‌ను ఫాలో అయ్యారు.

    కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ “పొంపాడర్ హెయిర్‌”(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్‌ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు.

    విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్

    లైగర్

     ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. “లాంగ్ వేవీ”(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు.

    ఇదే చిత్రంలో దేవరకొండ ‘మ్యాన్ బన్’ హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ… విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు.

    డియర్ కామ్రెడ్

    డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

    ఖుషి

    ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.

    ఫ్యామిలీ స్టార్

    ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్‌ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు.

    రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్

    స్కంద

     ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్‌ పొత్తినేని(RAPO) ‘స్పైకీ’ హేయిర్‌ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్‌ స్టైల్‌ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు.

    ఇస్మార్ట్ శంకర్

    ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్‌ ట్రెండ్ సెట్‌ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు “హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్” ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv