• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan Kalyan: వాలంటీర్లపై పవన్ కామెంట్స్.. వైసీపీకి అనుకూలంగా మారాయా?

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిరేపాయి. వాలంటీర్లు సేకరించే సమాచారం వల్లే యువతులు అదృశ్యమవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పవన్​ దిష్టి బొమ్మలను దగ్దం చేస్తూ నిరసన తెలిపారు. వీరికి వైసీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. కొందరు వైసీపీ నేతలైతే పవన్ వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ వారంటీర్ల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటున్నారు. దీంతో వాలంటీర్లకు ప్రభుత్వంపై ఉన్న కోపం కాస్త చల్లబడి ఉంటుందని చెబుతున్నారు. వాలంటీర్లపై ఇప్పటిదాకా స్వచ్చంద సేవా ముసుగులో తాము నిలువు దోపిడీకి గురవుతున్నామనే ఆవేదన.. వైసీపీ నేతల మద్దతుతో దూరమైనట్లు కనిపిస్తోంది.  

    వైసీపీకి అనుకూల శత్రువుగా.. 

    ప్రభుత్వం తమ సేవలను వినియోగించుకుని తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాలంటీర్లు గుర్రుగా ఉన్నారు. చాలిచాలని జీతాలతో నెట్టకొస్తూ వచ్చే ఎన్నికల నాటికైనా తమ భవితవ్యం మారకపోదా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పవన్​ వ్యాఖ్యలతో వాలంటీర్లు తీరు ఒక్కసారిగా మారిపోయింది. తమ వృత్తినే అవమానించినట్లు భావించి ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ఈ విషయంలో పవన్​ వైసీపీకి అనుకూల శత్రువుగా మారినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

    వాలంటీర్ల దెబ్బకు టీడీపీ సైలెంట్  

    వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. అసలే నిరుద్యోగంతో అల్లాడుతున్న యువత.. దొరికిందే మహాప్రసాదం అనుకుంటూ వాలంటీర్లుగా చేరారు. కానీ, ఇది ఉద్యోగం కాదని, స్వచ్చంద సేవలాంటిదని ప్రభుత్వం ప్రకటించడంతో వారిలో ఆగ్రహం మొదలైంది. అయినా సరే రూ. 5 వేల వేతనానికి పనిచేయడానికి సిద్దమయ్యారు. దాదాపు ఎక్కువ శాతం మంది వాలంటీర్లు అధికార పార్టీకి చెందిన వారి మనుషులే ఉన్నారు. దీన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ప్రజలు వాలంటీర్ల సేవలకు అలవాటు పడటంతో ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు, మెరుగైన వేతనం కల్పించే హామీలు ఇవ్వాల్సి ఉంటుంది.  

    వైసీపీకి సానుకూలమా?

    ప్రతి 60 నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీరు నియామకం జరిగింది. సంక్షేమ పథకాలను అందించడంలో వీరు కీలకంగా మారారు. ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా వాలంటీరునే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంటి ముందుకే వస్తూ రేషన్​ సరకులు అందించడం నుంచి ప్రతి విషయంలోనూ వాలంటీరు పాత్ర కీలకంగా మారింది. దీంతో వాలంటీర్ల సేవలతో లబ్ధి పొందుతున్న ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ వాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. పరోక్షంగా ఇది వైసీపీకి సానుకూలతకు దారి తీసే ముప్పు కనిపిస్తోంది.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv