అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్‘ కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్!
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్‌తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రోమోలో ఏముందంటే?
సెకండ్ సాంగ్ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్ సెట్‌లో రష్మిక మేకప్ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.
పూర్తి సాంగ్ ఎప్పుడంటే?
పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆ రోజున ఫ్యాన్స్‌కు పండగే
భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.