పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్ పోతినేని, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్, భాగ్యశ్రీ అందాలు, హరీశ్ శంకర్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.
డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
తంగలాన్ (Thangalaan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆయ్ (Aay)
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్’ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. గోదావరి విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
వేదా (Vedaa)
జాన్ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వేదా’ (Vedaa). నిఖిల్ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది.
ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein)
ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ (khel khel mein)గా రాబోతోంది. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
డార్లింగ్
ప్రియదర్శి, నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.
వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra)
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ‘వీరాంజనేయులు విహార యాత్ర‘ పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. సీనియర్ నటుడు నరేశ్, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.
మనోరథంగల్ (Manorathangal)
కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్స్ నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మనోరథంగల్’. తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్.టి వాసుదేవన్ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Daughters | Movie | English | Netflix | August 14 |
Worst Ex Ever | Series | English | Netflix | August 14 |
Emily In Paris | Series | English | Netflix | August 14 |
The Union | Movie | English | Netflix | August 16 |
Love Nexts Door | Movie | Korean/English | Netflix | August 17 |
Darling | Movie | Telugu | Hotstar | August 13 |
The Tyrant | Movie | Korean/English | Hotstar | August 14 |
Nam Namak Nishan | Movie | Hindi | Amazon | August 14 |
Jackpot | Movie | English | Amazon | August 15 |
Chanak | Series | Hindi | SonyLIV | August 16 |
Manorathangal | Series | Telugu Dub | Zee 5 | August 15 |
Sekhar Home | Movie | Hindi | Jio Cinema | August 14 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్