నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్‌స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ – సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.

ఫుల్ స్వింగ్‌లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న ‘రామయణం’ కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.

పోలీసు ఆఫీసర్‌గా విజయ్
‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్‌లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన ‘కృష్ణమ్మ’ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్