• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!

    ఒకప్పుడు వీకెండ్‌ అనగానే ఏ సినిమాను థియేటర్‌లో చూడాలా? అని ప్రేక్షకులు తెగ ఆలోచించేవారు. అయితే ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు/సిరీస్‌లు చూసేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రముఖ ఓటీటీ వేదికలు కూడా ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు.. ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి. 

    గామి (Gaami)

    హీరో విశ్వక్ సేన్‌ ఇటీవల చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా (ఏప్రిల్‌ 12).. ‘జీ 5’ (Zee 5) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీ ప్లాట్‌ విషయానికి వస్తే.. అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్‌ తన అన్వేషణ మెుదలు పెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.

    ప్రేమలు (Premalu)

    నస్లెన్ కే గఫూర్మమితా బైజు నటించిన ‘ప్రేమలు‘ కూడా ‘ఆహా’ వేదికగా  (ఏప్రిల్‌ 12) ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంలో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం.. తెలుగులోనూ రిలీజై ఆకట్టుకుంది. ఈ వారం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‍టైనర్‌ను చూడాలని భావించే వారికి ‘ప్రేమలు’ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ – రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌.

    ఓం భీమ్‌ బుష్‌ (Om Bheem Bush)

    శ్రీ విష్ణు హీరోగా ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో చేసిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓం భీమ్‌ బుష్‌‘. థియేటర్లలో సూపర్ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా (ఏప్రిల్‌ 12) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇందులో ప్రీతి ముకుందన్‌, అయేషా ఖాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, మనీష్ కుమార్‌, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

    లాల్‌ సలామ్ (Lal Salaam)

    సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ మూవీ సైతం ఈ వీకెండ్‌ స్ట్రీమింగ్‌లోకి రానుంది. సన్‌ నెక్స్ట్‌ వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ప్రసారం కానుంది. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఐశ్వర్య.. ఈ మూవీ ద్వారా తీవ్రంగా నిరాశపరిచింది. కథ విషయానికి వస్తే.. హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఇద్దరు క్రికెటర్లు చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులుగా ఉంటారు. కొంత కాలం ఒకే జట్టుకు ఆడినప్పటికీ.. వారిలో ఒకరు కొత్త టీమ్‌ను స్థాపిస్తారు. దీంతో రెండు జట్లు రెండు మతాలకు ప్రాతినిథ్యం వహించడం ప్రారంభిస్తాయి. ఈ క్రమంలో ఓ మ్యాచ్‌ ఆ ఇద్దరు క్రికెటర్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. అప్పుడు ముస్లిం క్రికెటర్‌ తండ్రి (రజనీ) ఏం చేశాడు? అన్నది కథ.

    యాత్ర 2 (Yatra 2)

    ఏపీ సీఎం జగన్‌ జీవితం ఆధారంగా తీసిన ‘యాత్ర 2’ కూడా ఏప్రిల్‌ 12న ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సీఎం జగన్‌.. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి రావటానికి గల కారణమేంటి? ఓదార్పు యాత్రకు నాటి నాయకులు సృష్టించిన అడ్డంకులు ఏంటి? వాటిని జగన్‌ ఎలా అధిగమించారు? అన్నది కథ.

    కాజల్‌ కార్తిక (Kajal Karthika)

    కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హార‌ర్ మూవీ ‘కాజ‌ల్ కార్తీక’.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్‌ 9న నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సినిమా మంచి వ్యూస్‌తో రాణిస్తోంది. ఆరు క‌థ‌ల‌తో రూపొందిన ఈ అంథాల‌జీ మూవీకి డీకే దర్శకత్వం వహించారు. హర్రర్‌ ఎంటర్‌టైనర్లను ఇష్టపడే వారు ఈ వారం ‘కాజల్‌ కార్తిక’ను చూడవచ్చు. కథలోకి వెళ్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్లి అక్కడ వందేళ్ల నాటి పుస్తకాన్ని చదువుతుంది. అందులోని ఐదు దయ్యాల పాత్రలు ఒక్కొక్కటిగా కళ్ల ముందుకు వస్తుంటాయి. అలా వచ్చిన కార్తిక (కాజల్‌) ఎవరు? ఆమె మరణానికి గ్రామస్తులు ఎందుకు కారణమయ్యారు? మిగిలిన నాలుగు దెయ్యాల పాత్రలు ఏంటి? అన్నది కథ.

    అదృశ్యం (Adrishyam)

    ఈటీవీ విన్‌ వేదికగా ఏప్రిల్‌ 4న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన లేడి ఓరియెంటేడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అదృశ్యం’. ఈ చిత్రానికి ఓటీటీలో పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ కోరుకునే వారు వీకెండ్‌లో ఈ మూవీని చూడవచ్చు. ఇందులో అపర్ణ బాలమురళి లీడ్‌ రోల్‌ చేసింది. సుధీష్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. స్టోరీ లోకి వెళ్తే.. జానకి (అపర్ణ బాలమురళి) పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడ్ని హత్య చేసినట్లు సీఐ కరుణన్‌తో చెప్తుంది. పాతిపెట్టిన స్థలాన్ని కూడా చూపిస్తుంది. అయితే మీడియాతో ఈ హత్య చేసింది సీఐ కురణన్‌ అని జానకి చెప్పడంతో అంతా షాకవుతారు. పైగా పాతిపెట్టిన చోట రెండు శవాలు దొరకడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ బాడీలు ఎవరివి? జానకి లవర్‌ అశ్విన్‌ ఏమయ్యాడు? అన్నది కథ.

    చారి 111 (Chari 111)

    హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ స్పై ఏజెంట్‌గా నటించిన లేటెస్ట్ చిత్రం.. ‘చారి 111‘. థియేటర్‌లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్‌లో ఇండియా వైడ్‌గా నాల్గో స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. చారి (వెన్నెల కిషోర్) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఏజెంట్. సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్‌ చేత చివాట్లు తింటుంటాడు. ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ కేసును సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. అతడు ఈ కేసును ఎలా ఛేదించాడు? క్రైమ్‌ వెకనున్న వ్యక్తి ఎవరు? అన్నది కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv