• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022 రౌండప్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ 

  ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 2022లో జరిగిన విషయాలేంటో ఓ సారి చూద్దాం.

  దివికేగిన దిగ్గజాలు

  ఈ ఏడాది వినోదరంగంలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్‌ స్టార్ కృష్ణ, లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచారు. గ్రేట్ సింగర్స్‌ కేకే అనుకోకుండా చనిపోవటం, సిద్దూ మూసేవాలా హత్య ఫ్యాన్స్‌ను కన్నీటి పర్యంతం చేశాయి.

  కెేరాఫ్ బ్లాక్ బస్టర్స్‌

  2022లో వివిధ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. RRR, KGF-2, బ్రహ్మస్త్ర, విక్రమ్, PS-1, కాంతారా వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

  లేటు వయసు ఘాటు ప్రేమ

  ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీ, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు లలిత్‌ మోదీ లీక్‌ చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

  వివాహాలు

  రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్. నాగశౌర్య, అనూష శెట్టి. నయన్, విజ్ఞేశ్ శివన్ లాంటి ప్రముఖుల వివాాహాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగాయి.

  విడాకులు

  2022లో ధనుష్, ఐశ్వర్య విడిపోయి విడాకు వార్తలు అభిమానులను నిరాశకు గురిచేసింది. వారు తర్వాత తమ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. రాఫ్తార్- కోమర్ వోహ్రా, హనీ సింగ్ – షాలినీ, ఇమ్రాన్ ఖాన్ – అవంతిక మాలిక్‌తో పాటు సోహేల్ ఖాన్ జంట వేరుపడ్డారు.

  దీపికా పదుకొణే రికార్డ్స్‌

  దీపికా పదుకొణేకి ఈ ఏడాది ఓ టర్నింగ్ పాయింట్. కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీలో సేవలందించే అవకాశం దక్కించుకుంది. లూయిస్ విట్టన్, కార్టియర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఫిఫా వరల్డ్‌ కప్ ట్రోఫీ లాంఛ్‌లో పాల్గొన్న మెుదటి భారతీయురాలు దీపికా పదుకొణే.

  బాయ్‌కాట్‌ రచ్చ

  బాలీవుడ్‌లో ఈ ఏడాది కూడా బాయికాట్‌ హ్యాష్‌ ట్యాగ్ కొనసాగింది. అమీర్‌ ఖాన్ నటించిన లాల్‌ సింగ్ చడ్డా, విజయ్ దేవరకొండ లైగర్‌ను బాయికాట్‌ చేయాలని రచ్చ చేశారు. ఇప్పుడు పఠాన్‌ సినిమాపైనా వివాదం నడుస్తోంది.

  కలిసిరాలేదు

  బాలీవుడ్‌కు 2022 అస్సలు కలిసి రాలేదు. బాక్సాఫీస్‌ వద్ద ఎన్నో పెద్ద సినిమాలు బోల్తా పడ్డాయి. అక్షయ్‌ కుమార్‌ 5 చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. బాలీవుడ్‌లో ఈ ఏడాది దక్షిణాది చిత్రాలు రాజ్యం ఏలాయి. 

  అవతార్‌ ది వే ఆఫ్ వాటర్

  సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన అవతార్ సీక్వేల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్‌ సినిమా ఎట్టకేలకు విడుదలయ్యింది. డిసెంబర్ 16న విడుదలైన విజువల్ వండర్ హిట్ సాధించింది.

  కశ్మీర్ ఫైల్స్ కహానీ

  వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ విడుదలైనప్పటి నుంచి వివాదాలకు దారితీసింది. కశ్మీర్‌ పండిట్‌ హత్యల నేపథ్యంలో సాగే సినిమా ఇది. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇజ్రాయెల్ డైరెక్టర్‌ నాదవ్ లాపిడ్ సినిమాపై విమర్శలు చేశారు.

  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ఆరాటం

  భారతదేశంలో అత్యంత జనాధరణ పొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం కాకుండా లాస్ట్‌ ఫిల్మ్‌ షో చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్‌కు నామినేట్‌ చేయడం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీసింది. ఫిల్మ్‌ ఫెడరేషన్ నిర్ణయం పట్ల చాలామంది ప్రేక్షకులు విబేధించారు. 

  జాక్వెలిన్‌ ఈడీ కేసు

  సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 215 కోట్ల మనీలాండరింగ్ కేసులో హీరోయిన్ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఈడీ పిలవటం దుమారం రేపింది. సుఖేష్‌తో ఆమెకు ఉన్న పరిచయంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల జాక్వెలిన్ నిర్దోషిగా విడుదలైనప్పటికీ ఆమె దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు.

  ఫిఫా వరల్డ్‌కప్‌లో నోరా

  ఖతర్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఈవెంట్‌లో నోరా ఫతేహీ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అద్భుతమైన డాన్స్‌తో  ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.

  తల్లిదండ్రులుగా

  సినీ పరిశ్రమలో ప్రముఖులు తల్లిదండ్రులయ్యారు. అలియాభట్ – రణ్‌బీర్ కపూర్‌, సోనమ్ కపూర్‌ – ఆనంద్ అహుజా, నిక్ జోన్స్ – ప్రియాంక చోప్రా, బిపాసా బసు – కరణ్ సింగ్ గ్రోవర్, కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లూ, నయనతార – విజ్ఞేశ్ శివన్ దంపతులు వారి పిల్లలను ప్రపంచంలోకి ఆహ్వానించారు.

  మిస్ ఇండియా

  కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల సిని శెట్టి ఫెమినా మిస్‌ ఇండియా 2022 టైటిల్‌ను గెలుచుకున్నారు.

  రీ రిలీజ్ ట్రెండ్

  గతంలో బ్లాక్‌ బస్టర్ సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేయటం తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ అయ్యింది. దీనిని కోలీవుడ్, బాలీవుడ్‌ కొనసాగించాయి. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు కురిపిస్తున్నాయి.

  ఆదిపురుష్‌ టీజర్ ట్రోల్స్‌

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూసిన ఆదిపురుష్‌ టీజర్ విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. దసరా కానుకగా వచ్చిన టీజర్‌లో VFXపై ట్రోల్స్‌ బీభత్సం సృష్టించాయి.

  నం. 1 టాక్‌ షో ?

  ప్రజల నుంచి పాజిటివ్, నెగటివ్ రివ్యూస్‌ పొందుతూ కాఫీ విత్ కరణ్ షో ఏడాది మెుత్తంగా వార్తల్లో నిలిచింది. బాలయ్య అన్‌స్టాపబుల్ కూడా అంతేస్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. 

  విజయ్‌ దేవరకొండ వివాదం

  2022 విజయ్ దేవరకొండకు కాస్త ఇబ్బందిగానే సాగింది. లైగర్‌ ప్రమోషన్లలో భాగంగా అతడు చేసిన కొన్ని కామెంట్స్‌ వివాదస్పదం అయ్యాయి. జాతీయ మీడియా వీటిని చూపించందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక పూరీ డైరెక్షన్‌లో వచ్చిన లైగర్ విజయ్ కెరీర్‌లోనే అట్టర్ ఫ్లాప్‌.

  రిచా చద్ధా కామెంట్స్

  ఆర్మీ గురించి చేసిన వివాదాస్పద కామెంట్లతో ఫక్రే నటి రిచా చద్దా నెటిజన్లు, ప్రజాప్రతినిధులతో పాటు సహచర నటుల నుంచి విమర్శలు వచ్చాయి. తర్వాత ఆమె తన కామెంట్స్ ఉపసంహరించుకొని క్షమాపణ కోరటంతో సద్దుమణిగింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv