ఆదిపురుష్ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. వరల్డ్‌వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజైంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల దృష్టి ఈ సినిమా కలెక్షన్లపై పడింది. తొలి రోజు ఆదిపురుష్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి మొదలైంది. మునపటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు భారీగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. మరి, ఇండస్ట్రీలో ఇది వరకు భారీ ఓపెనింగ్స్‌ని రాబట్టిన సినిమాలేంటి? ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లను సాధించాయి? అనే అంశాలను తెలుసుకుందాం.
బాహుబలి 2
ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా ‘బాహుబలి2’ అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్ల వసూళ్లను సాధించింది. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ నిర్మించింది.
కేజీఎఫ్ 2
కన్నడ నాట పెను సంచలనం రేపిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కేజీఎఫ్2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.164 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1300 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్
ఆస్కార్ అవార్డును గెలుచుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లలోనూ దూసుకెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించడం, బాహుబలి తర్వాత జక్కన్న చేసిన సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.158 కోట్లను కలెక్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది.
సాహో
బాహుబలి-2 సినిమాతో హీరో ప్రభాస్ మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందుకు అనుగుణంగానే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మందగించాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లు కలెక్ట్ చేసింది.
పఠాన్
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లలో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2023లో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
రోబో 2.0
రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబోలో వచ్చిన చిత్రం రోబో 2.0. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.106 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది. కానీ, అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైంది. దీంతో ఓవరాల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!