అనుకోకుండా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్. తొలి మూవీలో తడబడినప్పటికీ తదనాంతరం విలన్‌గా, విజయవంతమైన హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. తన నటనా ప్రస్థానంలో విజయాలకు పొంగకుండా, విమర్శలకు కుంగకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాడు. మాస్ లుక్‌తో మనందరి మనసులు దొచ్చేస్తున్న ఈ యాక్షన్ స్టార్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
గోపీచంద్ ఎవరు..?
హీరో, విలన్, నటుడు
పుట్టిన రోజు ఎప్పుడు..?
తొట్టెంపూడి కృష్ణ-కోటేశ్వరమ్మ దంపతులకు జూన్ 12, 1979లో ఏపీలోని ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఇతని తండ్రి కృష్ణ ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్‌గా కొనసాగారు. ‘నేటి భారతం, మొనగాడు, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే గోపీచంద్ అన్న ప్రేమ్‌చంద్ అసోసియేట్ డైరెక్టర్‌గా ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిచేశారు. ప్రేమ్‌చంద్ కారు ప్రమాదంలో చనిపోయాడు.
వయస్సు, ఎత్తు ఎంత?
గోపీచంద్ వయసు 42 సంవత్సరాలు. ఎత్తు 6’1(1.86 మీటర్లు) అడుగులు. టాలీవుడ్ పరిశ్రమలో ఆరడుగుల ఎత్తు ఉన్న అతితక్కువ మంది హీరోలో గోపీచంద్ ఒక్కరు.
ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు..?
దాదాపు 25 సినిమాలకు హీరోగా నటించాడు. హీరోగా, విలన్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు. రణం, గోలీమార్, సాహసం, జిల్, సీటీమార్ మూవీలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
బాల్య నటుడిగా ప్రస్థానం ఎప్పుడు..?
రష్యాలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఇతనికి మొదట్లో అసలు సినిమాలు అంటే ఆసక్తే లేదట. అన్న మరణాంతరం 2001లో తొలి వలపు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం అంతగా సక్సెస్ సాధించకపోవడంతో జయం సినిమాతో విలన్‌గా అవతారమెత్తాడు, వరుసగా నిజం, వర్షం మూవీలలో ప్రతి నాయకుడి పాత్ర చేసి అందరినీ మెప్పించాడు. మళ్లీ యజ్ఞం చిత్రంతో హీరోగా మారాడు.
గోపీచంద్ భార్య ఎవరు..? పెళ్లి ఎప్పుడు జరిగింది..?
ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేనకోడలైన రేష్మాను 2013, మే 12న వివాహం చేసుకున్నారు. తొలుత గోపీచంద్ ఆమె ఫొటోను చూశాడట. తదనాంతరం యాక్టర్ చలపతిరావుతో శ్రీకాంత్‌ని అడిగించగా వెంటనే రేష్మా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట. వీరు ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చారు.
ముద్దు పేర్లు ఏంటి..?
గోపీచంద్‌ని అభిమానులు ప్రేమగా యాక్షన్ స్టార్, మాచో స్టార్ అని పిలుస్తుంటారు. ఇతడు ఎక్కువగా మాస్ లుక్‌లతో సినిమాలు చేస్తుంటాడు.
ఇష్టమైన మూవీ ఏది..?
2009లో ప్రపంచవ్యాప్తంగా హిట్ సాధించిన అవతార్ అనే హాలీవుడ్ చిత్రమంటే తెగ ఇష్టమట. అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి, సౌందర్య అభిమాన నటులు.
ఇష్టమైన ఫుడ్, పుస్తకం, వ్యాపకాలు..?
గోపీచందర్‌కి చికెన్‌తో తయారు చేసే వంటకాలంటే బాగా ఇష్టమట. నచ్చిన పుస్తకాల గురించి పెద్దగా ప్రస్థావించలేదు. సినిమాలు చూడటం, ఖాళీ సమయంలో స్నేహితులతో బయటికి వెళ్తుంటాడు.
ఎన్ని అవార్డులు వరించాయి..?
ఇతని నటనకు గుర్తింపుగా నంది, ఫిల్మ్‌ఫేర్, సినిమా అవార్డులు వరించాయి. విలన్‌గా నటించిన జయం మూవీకి నంది అవార్డు రావడం గమనార్హం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!