• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestions: ఈ వీకెండ్‌.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే

    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌ (OTT Suggestions)లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. 

    జీబ్రా (Zebra)

    సత్యదేవ్‌, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్‌ కథానాయిక. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. డేట్ అనౌన్స్‌ చేయనప్పటికీ డిసెంబర్‌ 14న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాట్ ఏంటంటే ‘మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ.

    తంగలాన్‌ (Thangalan)

    తమిళ స్టార్‌ హీరో విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్‌‘ చిత్రం ఈ వారమే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పా. రంజిత్‌ దర్శకత్వం వహించగా మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే ‘తంగలాన్‌ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్‌ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్‌ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ.

     7/G 

    సోనియా అగర్వాల్‌ (OTT Suggestions), స్మృతి వెంకట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G’. హరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెరిఫిక్‌ హారర్‌ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘రాజీవ్‌, వర్ష దంపతులు ఐదేళ్ల కుమారుడితో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్‌ అవుతారు. అక్కడ వర్షకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. అతీతశక్తులతో ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.  

    బౌగెన్‌విల్లా (Bougainvillea)

    మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, కుంచకో బోబన్‌, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బౌగెన్‌విల్లా’. థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 13 నుంచి సోని లివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘థామస్, రీతు భార్య భర్తలు. యాక్సిడెంట్‌లో గీతు గతం మర్చిపోతుంది. మరోవైపు మినిస్టర్‌ కుమార్తె మిస్సింగ్‌ కేసు రాష్ట్రంలో సంచలనం సృషిస్తుంటుంది. యాక్సిడెంట్‌కు ముందు మినిస్టర్‌ కుమార్తెను రీతు ఫాలో కావడం చూసి దర్యాప్తు చేసేందుకు ఏసీపీ కోషి వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ ఏసీపీకి తెలిసిన షాకింగ్‌ నిజాలేంటి? అసలు మినిస్టర్‌ కూతుర్ని కిడ్నాప్‌ చేసింది ఎవరు? అన్నది స్టోరీ.

    హరికథ (Harikatha)

    పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ‘హరికథ: సంభవామి యుగే యుగే’ (OTT Suggestions) పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ ఈ వారమే హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. 

    రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)

    హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా ‘రోటి కపడా రొమాన్స్‘. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిసెంబర్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే ‘ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్‌ రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌), ఆర్జే సూర్య (తరుణ్‌), విక్కీ(సుప్రజ్‌ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్‌ లైఫ్‌ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి?’ అన్నది స్టోరీ

    కంగువా (Kanguva)

    ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘కంగువా‘ (Kanguva OTT Release) డిసెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ.

    అమరన్‌ (Amaran)

    పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం ‘అమరన్‌‘ . అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ.

    విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video)

    యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం గత వారం ఓటీటీలోకి వచ్చింది. ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో‘ (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv